ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. టాటా మోటార్స్, కేపీఐటీ టెక్ మోస్ట్ యాక్టివ్‌గా ఉన్నాయి. నిఫ్టీ ఐటీ స్టాక్స్ ఒక శాతం మేర లాభపడ్డాయి. డాలర్ మారకంతో భారత రూపాయి 72.96 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. క్రితం సెషన్లో 72.93 వద్ద క్లోజ్ అయింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్లు పెరగడంతో ఈ ప్రభావం రూపాయిపై పడింది. నిన్న అమెరికా సూచీలు లాభాల్లో ముగిశాయి. 1.9 బిలియన్ డాలర్ల కరోనా ప్యాకేజీకి ఆమోదం దిశగా పురోగతి, టెక్ షేర్లు దూకుడుగా మార్కెట్‌ను ముందుకు నడిపించాయి.
బాండ్స్ రాబడి పెరుగుదలలో స్థిరత్వం నెలకొనడం సూచీలకు కలిసి వచ్చింది. దీంతో మంగళవారం డౌజోన్స్ 0.10 శాతం, ఎస్ అండ్ పీ 500 1.42 శాతం, నాస్‌డాక్ కాంపోజిట్ 3.69 శాతం ఎగిశాయి. దీంతో నేడు ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగా కదలాడాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపించింది. కరోనా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది.

సెన్సెక్స్ భారీ లాభాల నుండి..
సెన్సెక్స్ ఉదయం 51,404.68 వద్ద ప్రారంభమై, 51,430.43 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,103.14 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్లో 51,025 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఓ సమయంలో 400 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్ మధ్యాహ్నం 12 సమయానికి 92 పాయింట్ల లాభంలోకి వచ్చింది. నిఫ్టీ 15,202.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,218.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,126.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ 106 పాయింట్లు లాభపడి 51,131 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు ఎగిసి 155,122 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్ 2.68 శాతం, టెక్ మహీంద్రా 2.13 శాతం, విప్రో 1.50 శాతం, HCL టెక్ 1.46 శాతం, బజాజ్ ఆటో 1.40 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ONGC 2.53 శాతం, SBI లైఫ్ ఇన్సురా 2.18 శాతం, UPL 1.88 శాతం, HDFC లైఫ్ 1.85 శాతం, ఐవోసీ 1.64 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.14 శాతం, మిడ్ క్యాప్ 0.35 శాతం మేర లాభపడ్డాయి. రంగాల వారీగాచూస్తే నిఫ్టీ ఆటో 0.60 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.24 శాతం, నిఫ్టీ ఐటీ 1.33 శాతం, నిఫ్టీ మీడియా 0.27 శాతం, నిఫ్టీ ఫార్మా 0.80 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.66 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.09 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.60 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.10 శాతం, నిఫ్టీ మెటల్ 0.08 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.36 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.02 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications