స్టాక్ మార్కెట్లు గురువారం ఊగిసలాటలో ఉన్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. అంతలోనే మళ్లీ క్షీణించాయి. మొత్తానికి ఊగిసలాటలో కనిపిస్తున్నాయి. మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 55,400 దిగువకు, నిఫ్టీ 16550 దిగువన ట్రేడ్ అయ్యాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 12 పైసలు క్షీణించి 77.62 వద్ద కొనసాగుతోంది. రంగాలవారీగా ఆటో, ఫైనాన్స్ సూచీలు నష్టాల్లో ఉండగా, చమురు, మెటల్ రంగాల షేర్లు కొనుగోళ్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
సెన్సెక్స్ ఉదయం 55,382 పాయింట్ల వద్ద ప్రారంభమై, 55,382 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 55,135 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,481 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,529 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,443 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.9.55 సమయానికి సెన్సెక్స్ 18 పాయింట్లు క్షీణించి 55,398 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7 పాయింట్లు క్షీణించి16,516 పాయింట్ల వద్ద కదలాడింది. మార్కెట్లు స్వల్ప లాభాలు లేదా స్వల్ప నష్టాల్లోనే ఊగిసలాటలో ఉన్నాయి.

ఫైనాన్షియల్, ఆటో అర శాతం చొప్పున నష్టాల్లో ఉండగా, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ స్టాక్స్‌లో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. భారీ అంచనాలతో లిస్ట్ అయినా ఎల్ఐసీ ఐపీవో నేడు 0.099 శాతం క్షీణించి రూ.809 వద్ద ట్రేడ్ అయింది. భారీ అంచనాలతో లిస్ట్ అయిన ఎల్ఐసీ నష్టాల్లోకి వెళ్లడం గమనార్హం.


Click it and Unblock the Notifications