లాభాల నుండి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు, రుచించని ఆర్బీఐ నిర్ణయాలు
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (జూన్ 4) అతి స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. నిన్న మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే. నేడు అప్రమత్తంగా కదులుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.05 వద్ద ట్రేడ్ అయింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల నేపథ్యంలో ఉదయం సూచీలు అప్రమత్తంగా కదిలాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మానిటరీ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో సూచీలు క్షీణించాయి.

లాభాల నుండి నష్టాల్లోకి మార్కెట్లు
సెన్సెక్స్ నేడు ఉదయం 52,367.52 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,389.02 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,055.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.11.45 సమయానికి 85.27 (0.16%) పాయింట్లు క్షీణించి 52,147.16 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 15,712.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,733.60 వద్ద గరిష్టాన్ని, 15,642.55 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ ఉదయం గం.11.45 సమయానికి 18.80 (0.12%) పాయింట్లు క్షీణించి 15,671.55 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా 2.31 శాతం, ఓఎన్జీసీ 2.24 శాతం, ఐవోసీ 2.09 శాతం, లార్సన్ 1.36 శాతం, బీపీసీఎల్ 1.29 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో నెస్ట్లే 1.51 శాతం, హిండాల్కో 1.44 శాతం, టాటా స్టీల్ 1.13 శాతం, HUL 0.92 శాతం, SBI టెక్ 0.88 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో SBI, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.04 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.45 శాతం లాభపడింది. నిఫ్టీ ఆటో 0.56 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.64 శాతం, నిఫ్టీ ఐటీ 0.17 శాతం, నిఫ్టీ మీడియా 0.29 శాతం, నిఫ్టీ మెటల్ 0.08 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.59 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.30 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.59 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.07 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.27 శాతం, నిఫ్టీ ఫార్మా 0.05 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.44 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications