భారీ ఊగిసలాటల్లో మార్కెట్లు, అన్ని రంగాలు లాభాల్లోనే..
స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చినప్పటికీ మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ నిన్న 57,685 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 57,190 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,742 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,138 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. అంటే ఉదయం 500 పాయింట్లకు పైగా నష్టపోయినప్పటికీ, ఆ తర్వాత కోలుకొని అతి స్వల్ప లాభాల్లోకి వచ్చింది. తిరిగి నష్టపోయినప్పటికీ, స్వల్ప నష్టాల్లో ఉంది.
మధ్యాహ్నం గం.11 సమయానికి సెన్సెక్స్ 9 పాయింట్లు క్షీణించింది 57,675 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. అయితే ఆ తర్వాత స్వల్ప లాభాల్లోకి వచ్చింది. నిఫ్టీ క్రితం సెషన్‌లో 17,245 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 17,095 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,263 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,091 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11 సమయానికి 17,253 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ రోజు లాభనష్టాలతో ఊగిసలాడుతోంది.

నేడు ఉదయం టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో కొటక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, ఐచర్ మోటార్స్ ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్ మినహా అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications