దూసుకెళ్తున్న ఐటీ స్టాక్స్: తెలంగాణ యూనిట్‌పై అమెరికా వార్నింగ్ లేఖ, శిల్ప షేర్ ధర డౌన్

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. క్రితం వారం వరకు వరుసగా ఏడు సెషన్‌లలో లాభాలు నమోదు చేసిన మార్కెట్ నేడు (అక్టోబర్ 12) అదే ధోరణిలో ప్రారంభమైంది. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 360.16 పాయింట్లు(0.89%) పెరిగి 40,869.65 వద్ద, నిఫ్టీ 97.70 పాయింట్లు(0.82%) ఎగిసి 12011.90 వద్ద ప్రారంభమైంది.

నిఫ్టీ చాలా 12,000 మార్కును తాకింది. మధ్యాహ్నం గం.11 సమయంలో సెన్సెక్స్ 211 పాయింట్ల లాభంతో ఉంది. 809 షేర్లు లాభాల్లో, 326 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 61 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్, మెటల్, ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.

తెలంగాణ శిల్పా మెడికేర్‌కు FDA లేఖ

తెలంగాణ శిల్పా మెడికేర్‌కు FDA లేఖ

- అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(USFDA) నుండి వార్నింగ్ లేఖ నేపథ్యంలో శిల్పా మెడికేర్ స్టాక్ ధరలు ఓ సమయంలో 11 శాతం పడిపోయాయి. ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. తెలంగాణ జడ్చర్లలోని ఫెసిలిటీ సెంటర్‌కు అమెరికాకు చెందిన USFDA నుండి అక్టోబర్ 9న లేఖ వచ్చినట్లు కంపెనీ తెలిపింది. మిగతా యూనిట్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేవని తెలిపింది.

- బ్యాంకింగ్ స్టాక్స్ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎస్బీఐ స్టాక్ 3 శాతానికి పైగా లాభపడింది. కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐవోబీ, మహా బ్యాంక్, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంకులు 2.70 శాతం నుండి 0.40 శాతం మేర లాభపడ్డాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల యథాతథ నిర్ణయంతో పాటు మారటోరియం పొడిగింపు లేదని కేంద్రం, ఆర్బీఐ. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాల్లో ఉన్నాయి.

టాప్ గెయినర్స్ ఇవే..

టాప్ గెయినర్స్ ఇవే..

- టాప్ గెయినర్స్ జాబితాలో ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి.

- టాప్ లూజర్స్ జాబితాలో జేఎస్‌డబ్ల్యు స్టీల్, గెయిల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ ఉన్నాయి.

- యాక్టివ్ స్టాక్స్ జాబితాలో విప్రో, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐటీసీ ఉన్నాయి.

- యూటీఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ షేర్ రూ.500 వద్ద ఈ రోజు లిస్టింగ్ అయింది. ఇష్యూ ధర రూ.554 కావడం గమనార్హం.

- బీఎస్ఈ మిడ్ క్యాప్ ఫ్లాట్‌గా ఉంది.

- ఐటీసీ షేర్ బై-ప్రైస్‌ను సీఎల్ఎస్ఏ అప్ గ్రేడ్ చేసింది. దీంతో ఐటీసీ షేర్ నాలుగు శాతానికి పైగా ఎగిసింది.

ఐటీ స్టాక్స్ జూమ్

ఐటీ స్టాక్స్ జూమ్

- ఐటీ స్టాక్స్ ఈ రోజు కూడా అదరగొడుతున్నాయి. టీసీఎస్ షేర్ 0.48 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.14 శాతం, ఇన్ఫోసిస్ షేర్ ధర 1.56 శాతం, టెక్ మహీంద్ర 0.18 శాతం, విప్రో 0.24 శాతం, మైండ్ ట్ర 1.55 శాతం, కోఫోర్జ్ 2.96 శాతం లాభపడింది.

విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ కంపెనీలు నేటి నుండి మూడో క్వార్టర్ ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇప్పటికే టీసీఎస్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. మిగతా ఐటీ స్టాక్స్ ఫలితాలు కూడా సానుకూల ధోరణితో ఉంటాయనే ఆశాభావంతో ఫలితాలకు ముందు స్టాక్స్ ఎగుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+