నిన్న భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు నేడు దాదాపు అంతేస్థాయిలో పుంజుకున్నాయి. ఐటీ, మెటల్, రియాల్టీ స్టాక్స్ పరుగులు తీశాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ కూడా క్రమంగా బలపడుతోంది. క్రితం సెషన్లో 75.91 వద్ద క్లోజ్ అయింది. నేడు మధ్యాహ్నం సెషన్ సమయానికి 19 పైసలు బలపడి 75.72 వద్ద ట్రేడ్ అయింది. నిన్న సెన్సెక్స్ దాదాపు 1200 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. కీలక రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి.
దీంతో ట్రేడింగ్‌ని లాభాలతో ప్రారంభించాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఉదయం 500 పాయింట్ల లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలపడి మధ్యాహ్నం గం.12 సమయానికి వెయ్యి పాయింట్ల లాభాల్లోకి వచ్చి, ఉత్సాహంగా కదులుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి.

మెటల్ 4 శాతం జంప్
బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు రెండు శాతం చొప్పున లాభపడ్డాయి. ఐటీ, మెటల్, రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు రెండు శాతం నుండి మూడు శాతం చొప్పున లాభపడ్డాయి. ఉదయం 56,320.02 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, మధ్యాహ్నం వరకు 56,858.22 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,197.08 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ సమయంలో దాదాపు వెయ్యి పాయింట్లు ఎగిసింది.
మధ్యాహ్నం గం.12.15 సమయానికి సెన్సెక్స్ 1,036.21 (1.86%) పాయింట్లు లాభపడి 56,858.22 పాయింట్ల వద్ద, నిఫ్టీ 311.90 (1.88%) పాయింట్లు ఎగిసి 16,926.10 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
నిఫ్టీ బ్యాంకు, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ప్రయివేటు బ్యాంకు, హెల్త్ కేర్ ఇండెక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ 1.5 శాతం నుండి 2 శాతం మేర లాభపడ్డాయి.
నిఫ్టీ ఐటీ, మీడియా, మెటల్, రియాల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 2 శాతం నుండి 4 శాతం మేర లాభపడ్డాయి. మెటల్ అయితే నాలుగు శాతానికి పైగా లాభపడింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, హిండాల్కో, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యు స్టీల్ 3.5 శాతం నుండి 4.5 శాతం మేర లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.79 శాతం, సిప్లా 0.28 శాతం నష్టపోయాయి.

లాభాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లు కూడా లాభపడ్డాయి. నిక్కీ 2 శాతం, స్ట్రెయిట్ టైమ్స్ 0.36 శాతం, హాంగ్ షెంగ్ 0.83 శాతం, తైవాన్ వెయిటెడ్ 0.68 శాతం, కోస్పి 0.41 శాతం, సెట్ కాంపోజిట్ 0.63 శాతం, జకర్తా కాంపోజిట్ 0.01 శాతం, షాంఘై కాంపోజిట్ 0.80 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications