ముంబై: కరోనా మహమ్మారి భయాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అంతర్జాతీయ, దేశీయ మార్కెట్‌లకు నిన్న భారీ షాక్ తగిలింది. ఐరోపాలో కరోనా కేసులు పెరగడంతో మళ్లీ లాక్ డౌన్ విధించవచ్చుననే వార్తలు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలాయి. డెన్మార్క్, గ్రీస్, స్పెయిన్‌లలో తాజాగా ఆంక్షలు విధించారు. బ్రిటన్‌లో లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద బ్యాంకుల్లో భారీగా అక్రమ లావాదేవీలు అంటూ నివేదిక వచ్చింది. దీంతో నిన్న సెన్సెక్స్ 812 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 254 పాయింట్లు క్షీణించింది. ఈ రోజు కూడా ఉదయం మార్కెట్లు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి.

లాభాల నుండి నిమిషాల్లో 500 పాయింట్ల నష్టంలోకి..
ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 31 పాయింట్లు లాభంతో ప్రారంభమైన నిమిషాల్లోనే నష్టాల్లోకి వెళ్లింది. ఉదయం గం.9.20కి సెన్సెక్స్ 89.15 పాయింట్లు (0.23 శాతం) నష్టపోయి 38,123.29 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు(0.22 శాతం) క్షీణించి 11,275.50 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఐటీ, ఫార్మా రంగాలు అర శాతం చొప్పున లాభాలతో ప్రారంభమయ్యాయి. మిడ్ క్యాప్ సూచీ నష్టాల్లో ట్రేడ్ అయింది. పది నిమిషాల్లోనే సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టపోయి 37,830 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 92 పాయింట్లు నష్టపోయి 11,158 వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ ఓ సమయంలో 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. మార్కెట్ ప్రారంభమైన అరగంటలోనే సెన్సెక్స్ 250 పాయింట్ల నష్టం నుండి 300 పాయింట్ల వరకు పైకి, కిందకు కదిలింది. ఆ తర్వాత మళ్లీ 490 పాయింట్లకు పైగా నష్టపోయింది.

ఐటీ షేర్లు జూమ్
ఉదయం తొమ్మిదిన్నర సమయానికి HCL Tech షేర్ 1.80 శాతం, TCS 0.83 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.70 శాతం, టెక్ మహీంద్రా 1.28 శాతం, సన్ ఫార్మా 0.77 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 0.71 శాతం, ఏషియన్ పేయింట్స్ 0.48 శాతం, ఇన్ఫోసిస్ 0.08 శాతం, హిందూస్తాన్ యూనీ లీవర్ 0.05 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 0.05 శాతం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంకు, బ్రిటానియా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, జీ ఎంటర్టైన్మెంట్, గెయిల్, బీపీసీఎల్, టాటా మోటార్స్ ఉన్నాయి. ఐటీ, పార్మా షేర్లు దూకుడుమీద ఉన్నాయి. ఆటో, మెటల్, బ్యాంకు షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
మిడ్ క్యాప్‌లో కెనరా బ్యాంకు, జేఎస్‌పీఎల్, ఐఆర్బీ ఇన్ఫ్రా, కరూర్ వైశ్యా బ్యాంకు, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 7.40 శాతం నుండి 5.85 శాతం మధ్య క్షీణించాయి.

మార్కెట్ నష్టానికి కారణాలు
సోమవారం మార్కెట్లు కుప్పకూలాయి. కరోనా కేసులు పెరగడం, యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలు మళ్లీ లాక్ డౌన్ దిశగా వెళ్లడం, బ్యాంకుల్లో అవకతవకలు వంటి కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోయాయి. ఆ ప్రభావం ఆసియా, భారత మార్కెట్లపై పడింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications