స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం కాసేపు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి వెళ్లాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 76.17 వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 58,030 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,128 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,229 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,329 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,353 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,096 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 571 పాయింట్లు క్షీణించి 57,292 పాయింట్ల వద్ద, 169 పాయింట్లు క్షీణించి 17,117 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్టీపీసీ, మారుతీ, టైటాన్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, ఏషియన్ పేయింట్స్, అల్ట్రా టెక్ సిమెంట్స్, నెస్ట్లే ఇండియా, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. సూచీలు ఒక శాతం చొప్పున నష్టపోయాయి.

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన నెల రోజులు కావొస్తుంది. యుద్ధం ఆగిపోయినట్లుగా గతంలోనే కనిపించినప్పటికీ, పురోగతి మాత్రం కనిపించడం లేదు. ఓ వైపు బీకర దాడులు జరుగుతున్నాయి. మరోవైపు మరింత ఆధునిక ఆయుధాల వినియోగానికి సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించడంతో ఆసియా-పసిఫిక్ షేర్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ సూచీలు ఒక శాతం మేర నష్టపోయాయి. జపాన్‌కు చెందిన నిక్కీ మాత్రం 0.65 శాతం లాభపడటం గమనార్హం. యుద్ధ విరమణ దిశగా ఎలాంటి పురోగతి లేకపోవడం, ఇప్పటికే పలు దఫాల్లో జరిగిన చర్చలు విఫలం కావడంతో చమురు సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో వివిధ దేశాలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications