Stock Market: మనల్ని ఎవడ్రా ఆపేది అంటున్న Sensex, Nifty.. రికార్డుల మోత..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీ జైత్రయాత్రలా ముందుకు సాగుతోంది. ఉదయం మంచి లాభాల్లో ప్రారంభమైన సూచీలు కొత్త జీవితకాల గరిష్ఠాలతో రోజును మెుదలు పెట్టాయి.
ఉదయం 9.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 331 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 76 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 378 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 50 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, కోటక్ బ్యాంక్, రిలయన్స్, విప్రో, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ టి, హిందుస్థాన్ యూనీలివర్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ట్రేడవుతున్నాయి.
ఇదే సమయంలో ఎల్ టిఐఎమ్, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ఎయిర్ టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, సిప్లా, టాటా స్టీల్, హిందాల్కొ, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications