ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (నవంబర్ 19) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న భారీనష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ అండతో పుంజుకుని, లాభాల్లో ముగిశాయి. ఈరోజు సూచీలు మళ్ళీ కిందకు జారాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 284.74 పాయింట్లు(0.64%) నష్టపోయి 43,895.31 పాయింట్ల వద్ద, నిఫ్టీ 76.20 పాయింట్లు(0.59%) క్షీణించి 12,862.10 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
483 షేర్లు లాభాల్లో, 642 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 77 షేర్లలో ఎలాంటి మార్పులేదు. బ్యాంకింగ్ రంగ స్టాక్స్ ఒత్తిడిలో ఉన్నాయి. ఆటో, మెటల్, ఫార్మా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డాలర్ మారకంతో రూపాయి 10 పైసలు క్షీణించి 74.29 వద్ద ట్రేడ్ అయింది. గురువారం 74.19 వద్ద ముగిసింది.

రియాల్టీ జంప్
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.19 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.19 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.21 శాతం, నిఫ్టీ ఐటీ 0.21 శాతం, నిఫ్టీ మీడియా 0.73 శాతం, నిఫ్టీ మెటల్ 1.40 శాతం, నిఫ్టీ ఫార్మా 0.27 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.43 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.75 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.47 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.76 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.65 శాతం నష్టపోయాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్ 4.12 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 3.79 శాతం, టాటా స్టీల్ 3.20 శాతం, మహీంద్రా అంట్ మహీంద్రా 2.37 శాతం, బీపీసీఎల్ 2.36 శాతం ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా 4.05 శాతం, యూపీఎల్ 1.68 శాతం, HDFC బ్యాంకు 1.23 శాతం, ICICI బ్యాంకు 1.26 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 0.97 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటో కార్ప్, టాటా మోటార్స్ ఉన్నాయి.

ఏడాదిలో ఈ ఐటీ స్టాక్ 55 శాతం జంప్
భారత ఇంటర్నెట్ కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ బిజినెస్ యూనిట్లు కరోనా ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంది. అయినప్పటికీ ఏడాది ప్రాతిపదికన ఈ కంపెనీ స్టాక్ 55 శాతం రిటర్న్స్ అందించింది. ఈ స్టాక్ గత నాలుగు రోజులుగా ఆల్ టైమ్ గరిష్టం వద్ద ట్రేడ్ అవుతోంది. ఏడాది ప్రాతిపదికన ఐటీ స్టాక్స్ 37 శాతం లాభపడగా, ఇన్ఫో ఎడ్జ్ మాత్రం 55 శాతం ఎగిసింది.
తమ వ్యాక్సీన్ 95 శాతం ఫలితం ఇస్తోందని ఫైజర్ వ్యాక్సీన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ స్టాక్ 6 శాతం లాభపడింది. ఫేజ్ 3లో వ్యాక్సీన్ ఫలితాలు 95 శాతం ఉన్నట్లు వెల్లడించింది.
టీసీఎస్ 1.25 శాతం, టెక్ మహీంద్రా 1.18 శాతం, విప్రో 0.25 శాతం, మైండ్ ట్రీ 0.34 శాతం, కోఫోర్జ్ 2.18 శాతం లాభపడ్డాయి.
హెచ్‌సీఎల్ టెక్ 0.35 శాతం, ఇన్ఫోసిస్ 0.32 శాతం నష్టపోయాయి.

మరింత దిగజారిన లక్ష్మీ విలాస్ బ్యాంకు
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయిన లక్ష్మీ విలాస్ బ్యాంకు స్టాక్ నేడు మరింత క్షీణించింది. క్రితం సెషన్లో 20 శాతం క్షీణించి రూ.12.45కు పడిపోయిన స్టాక్ నేడు మరో 20 శాతం క్షీణించింది. రూ.2.45 తగ్గి రూ.10 వద్ద ట్రేడ్ అయింది.
మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ 52 వారాల గరిష్టాన్ని తాకింది. హీరో మోటో కార్ప్ 3 శాతం ఎగిసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర నేడు స్వల్పంగా 0.068 శాతం పెరిగి రూ.1988 వద్ద ట్రేడ్ అయింది. రూ.2000కు దిగువనే ఉంది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం.. రేసు గుర్రంలా దూసుకుపోతున్న స్టాక్స్ ఇవే.. ఓ కన్నేసి ఉంచండి..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..



Click it and Unblock the Notifications