స్టాక్ మార్కెట్లు సోమవారం (అక్టోబర్ 5) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 348.40 పాయింట్లు(0.90%) లాభపడి 39,045.45 వద్ద, నిఫ్టీ 97.50 పాయింట్లు(0.85%) ఎగిసి 11,514.50 ప్రారంభమైంది. 859 షేర్లు లాభాల్లో, 254 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 74 షేర్లలో ఎలాంటి మార్పు లేకుండా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాసేపటికి సెన్సెక్స్ 490 పాయింట్లకు పైగా ఎగిసింది.
అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ఉదయం టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటాస్టీల్, విప్రో, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో గెయిల్, ఏషియన్ పేయింట్స్, సిప్లా, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్ ఉన్నాయి. టీసీఎస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, రిలయన్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ మోస్ట్ యాక్టివ్‌గా ఉన్నాయి. ఐటీ స్టాక్స్ భారీ లాభాల్లో ఉన్నాయి.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) 52వారాల గరిష్టం రూ.2,649.95ను తాకింది. నేడు ప్రారంభ సెషన్‌లోనే 5 శాతం మేర లాభడింది. అక్టోబర్ 7వ తేదీన జరగబోయే సంస్థ ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదనను బోర్డు డైరెక్టర్లు పరిశీలించనున్నారని అక్టోబర్ 4న ఎక్స్చేంజీలకు తెలిపింది. దీంతో షేర్లు పుంజుకున్నాయి.
ట్రంప్ కరోనా నుండి కోలుకుంటున్నారనే వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. కరోనా కేసుల్లో క్షీణత పెరగడంతో పాటు వివిధ సర్వేలు ఆర్థిక రికవరీ క్రమంగా మెరుగుపడుతుందని వెల్లడిస్తున్నాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications