లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, ఐటీ స్టాక్స్ జూమ్
ముంబై: మార్కెట్లు మంగళవారం(సెప్టెంబర్ 29) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 183.25 పాయింట్లు( 0.48%) లాభపడి 38,164.88 పాయింట్ల వద్ద, నిఫ్టీ 59.10 పాయింట్లు (0.53%) ఎగిసి 11,286.60 వద్ద ప్రారంభమైంది. 865 షేర్లు లాభాల్లో, 183 షేర్లు నష్టాల్లో, 49 షేర్లలో ఎలాంటి మార్పు లేకుండా ప్రారంభించాయి. అన్ని రంగాలు లాభాల్లో ప్రారంభించాయి. అయితే ఆ తర్వాత 10 గంటల సమయానికి సెన్సెక్స్ 20 పాయింట్ల లాభాలకు క్షీణించింది. కాసేపటికి నష్టాలబాట పట్టింది.
టాప్ గెయినర్స్ జాబితాలో టీసీఎస్, హీరో మోటో కార్ప్, హిండాల్కో, విప్రో, ఐచర్ మోటార్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి. గత రెండు సెషన్‌లలో మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న ఐటీ స్టాక్స్ డీలా పడ్డాయి. ఈ రోజు తిరిగి పుంజుకున్నాయి.

టాప్ 5 గెయినర్స్‌లో రెండు ఐటీ స్టాక్స్ ఉన్నాయి. ప్రారంభ సెషన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.26 శాతం, టీసీఎస్ షేర్ ధర 2.81 శాతం, ఇన్ఫోసిస్ షేర్ ధర రూ.1.33 శాతం, విప్రో షేర్ ధర 1.75 శాతం, టెక్ మహీంద్ర షేర్ ధర 0.63 శాతం, హెచ్‌సీఎల్ టెక్ షేర్ ధర .019 శాతం, కోఫోర్జీ షేర్ ధర 0.44 శాతం లాభపడింది.


Click it and Unblock the Notifications