భారీ నష్టాల నుండి.. కరోనా సెకండ్ వేవ్‌తో నష్టాల్లో మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ నుండి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, దేశీయంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్ డౌన్ ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ ప్రభావం మార్కెట్లపై ఉంది. ఇటీవల మార్కెట్లు వరుసగా నష్టాల్లో ముగుస్తున్నాయి. నేడు కూడా అదే ఒరవడితో ప్రారంభమైంది. నిన్న శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా స్టాక్ మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. ఈ వారంలో అంతకుముందు రెండు సెషన్లలోను మార్కెట్లు నష్టపోయాయి.

నష్టాల్లోనే..
ఫార్మా, మెటల్ రంగాలు భారీగా లాభపడుతుండగా, ఎఫ్ఎంసీజీ రంగాలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ఉదయం 47,501.71 పాయింట్ల వద్ద ప్రారంభమై, 47,615.86 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 47,204.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.15 సమయానికి సెన్సెక్స్ 204.70 (0.43%) పాయింట్లు నష్టపోయి 47,501 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,219.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,288.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,151.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
ఉదయం గం.11.15 సమయానికి 45.40 (0.32%) పాయింట్లు నష్టపోయి 14250 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. అయితే సూచీలు భారీ నష్టాల నుండి స్వల్ప నష్టాల్లోకి వచ్చాయి. ఉదయం ఓ సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టపోయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
మధ్యాహ్నం వరకు టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో 4.54 శాతం, టాటా స్టీల్ 4.36 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.20 శాతం, JSW స్టీల్ 2.08 శాతం, BPCL 1.98 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్ 3.56 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.91 శాతం, టైటాన్ కంపెనీ 2.87 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.45 శాతం, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ 2.32 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.27 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.21 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.53 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.30 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.13 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.20 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.87 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.11 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.71 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.51 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ ఐటీ 0.12 శాతం, నిఫ్టీ మీడియా 0.06 శాతం, నిఫ్టీ మెటల్ 1.70 శాతం, నిఫ్టీ ఫార్మా 0.76 శాతం లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications