ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. వరుసగా నాలుగు రోజుల పాటు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. గత నాలుగు రోజుల్లో మార్కెట్ నష్టంతో ఇన్వెస్టర్ల సంపద రూ.5.5 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఉదయం ఓ సమయంలో 400 పాయింట్లకు పైగా లాభపడిన సూచీలు మధ్యాహ్నం కాస్త దూకుడు తగ్గించాయి. ఐటీ, టెక్నాలజీ, ఫార్మా రంగాలు మినహా ఇతర రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.
కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో కౌంటర్లు దూసుకెళ్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలమైనవృద్ధిని సాధించనుందని, దాదాపు 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోనుందని ఫెడ్ రిజర్వ్ వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ఉండగా, ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది.

సెన్సెక్స్, నిఫ్టీ జంప్
సెన్సెక్స్ 50,161.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,296.35 వద్ద గరిష్టాన్ని, 49,919.66 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,855.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,875.20 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,757.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిన్న 50,000 దిగువ ముగిసిన సెన్సెక్స్ నేడు 50,000 క్రాస్ చేసింది. 50,300 వరకు వెళ్లినప్పటికి, మధ్యాహ్నం ఆ మార్క్ వద్దే కదలాడుతోంది. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ 258.11 (0.52%) పాయింట్లు లాభపడి 50,055.03 వద్ద, నిఫ్టీ 77.35 (0.53%) పాయింట్లు ఎగిసి 14,803.10 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో 3.52 శాతం, టాటా మోటార్స్ 2.76 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.40 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.34 శాతం, ఐటీసీ 2.21 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.81 శాతం, ఇన్ఫోసిస్ 1.79 శాతం, కోల్ ఇండియా 1.11 శాతం, సన్ ఫార్మా 1.03 శాతం, హీరో మోటో కార్ప్ 0.93 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, రిలయన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.56 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.64 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.70 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.97 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.50 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.10 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.75 శాతం, నిఫ్టీ మీడియా 2.07 శాతం, నిఫ్టీ మెటల్ 1.59 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.63 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.88 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.91 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ 0.81 శాతం, నిఫ్టీ ఫార్మా 0.88 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications