ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం(మే 7) లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 49,000 పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ 14,800 పాయింట్లు దాటింది. కీలక రంగాల షేర్లు రాణించడం కలిసి వచ్చింది. కరోనా వ్యాక్సీన్ పైన మేధో హక్కుల నిబంధనలను తాత్కాలికంగా రద్దు చేయాలని WTOలో భారత్ చేసిన ప్రతిపాదనకు అమెరికా సమ్మతించింది. దీంతో టీకాల సరఫరా మెరుగుపడే అవకాశాలున్నాయనే సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును మరింత పెంచింది.

లాభాల్లో సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 49,169.14 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,417.64 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,169.14 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ 168.59 (0.34%) పాయింట్లు ఎగిసి 49,121.65 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,816.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,863.05 వద్ద గరిష్టాన్ని, 14,771.45 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మధ్యాహ్నం గం.1 సమయానికి 64.90 (0.44%) పాయింట్లు ఎగిసి 14,789.70 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 6.50 శాతం, అదానీ పోర్ట్స్ 4.38 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 3.53 శాతం, హిండాల్కో 3.32 శాతం, JSW స్టీల్ 2.51 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 4.16 శాతం, హీరో మోటో కార్ప్ 2.22 శాతం, బజాజ్ ఆటో 1.52 శాతం, ఐచర్ మోటార్స్ 0.99 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.87 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, హిండాల్కో, జేఎస్‌డబ్ల్యు స్టీల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.53 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.19 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.53 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.09 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.31 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.41 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.39 శాతం, నిఫ్టీ మీడియా 1.85 శాతం, నిఫ్టీ మెటల్ 4.67 శాతం, నిఫ్టీ ఫార్మా 0.18 శాతం, నిఫ్టీ మెటల్ 1.83 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.84 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఫార్మా 0.23 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.30 శాతం లాభపడ్డాయి.నిఫ్టీ ఐటీ 0.01 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.55 శాతం, నష్టపోయాయి.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..



Click it and Unblock the Notifications