ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. డాలర్ మారకంతో రూపాయి కాస్త పెరిగి 74.33 వద్ద ట్రేడ్ అయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్లు పెరగడంతో రూపాయి కాస్త పుంజుకుంది. క్రితం సెషన్‌లో 74.55 వద్ద ముగిసింది. ఉదయం 15 పైసలు పెరిగి 74.40 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో హాంగ్‌షెంగ్ లాభాల్లో ఉంది. స్ట్రెయిట్ టైమ్స్, నిక్కీ వంటి మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా, యూరోప్ మార్కెట్లు లాభాల్లో ముగియగా, డాలర్ బలహీనపడింది.

సెన్సెక్స్ జంప్
సెన్సెక్స్ ఉదయం 49,885.26 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,118.08 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,811.71 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నిన్న 49,661.76 పాయింట్ల వద్ద ముగిసింది. ఓ సమయంలో 360 పాయింట్ల మేర కూడా లాభపడింది. నిఫ్టీ 14,875 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,959 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,864 పాయింట్ల వద్ద కనిష్టాన్న తాకింది. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ 330.87 (0.67% ఎగిసి 49,992 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 128.90 (0.87%) పాయింట్లు ఎగిసి 14,946.70 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో JSW స్టీల్ 8.55 శాతం, టాటా స్టీల్ 5.77 శాతం, హిండాల్కో 4.32 శాతం, శ్రీసిమెంట్స్ 3.87 శాతం, టైటాన్ కంపెనీ 3.31 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఆటో 0.47 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.46 శాతం, SBI లైఫ్ ఇన్సురా 0.46 శాతం, HCL టెక్ 0.14 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా మోటార్స్, రిలయన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 స్టాక్ 0.91 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.23 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.46 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.18 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.57 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.59 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.66 శాతం, నిఫ్టీ ఐటీ 1.31 శాతం, నిఫ్టీ మీడియా 1.10 శాతం, నిఫ్టీ మెటల్ 4.77 శాతం, నిఫ్టీ ఫార్మా 0.77 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.37 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.19 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.50 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications