స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం సమయానికి దాదాపు 500 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 120 పాయింట్ల వరకు ఎగిసింది. సెన్సెక్స్ 49,000 పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ 15000 పాయింట్ల దిశగా కదులుతోంది. నిఫ్టీ బ్యాంకు, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు రెండు శాతానికి పైగా ఎగిశాయి. అదే సమయంలో ఫార్మా, మెటల్ సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రధానంగా ఫైనాన్షియల్ స్టాక్స్ ప్రభావంతో సెన్సెక్స్ 49వేల మార్కును క్రాస్ చేసింది.

భారీ లాభాల్లో మార్కెట్లు
సెన్సెక్స్ నేడు ఉదయం 48,990.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,256.52 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,923.13 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ 523.12 (1.07%) పాయింట్లు ఎగిసి 49,255 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 137.40 (0.94%) పాయింట్లు క్షీణించి 14,815 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,756.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,824.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,725.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో UPL 4.53 శాతం, SBI 4.48 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 4.01 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 3.24 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.94 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా 2.58 శాతం, లార్సన్ 1.84 శాతం, టాటా స్టీల్ 1.44 శాతం, భారతీ ఎయిర్ టెల్ 1.36 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 1.34 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, యూపీఎల్, టాటా స్టీల్, లార్సన్, సిప్లా ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.99 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.17 లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.13 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.86 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.38 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.11 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.18 శాతం, నిఫ్టీ ఐటీ 0.19 శాతం, నిఫ్టీ మెటల్ 0.13 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.40 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.63 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.69 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మీడియా 0.09 శాతం, నిఫ్టీ ఫార్మా 0.09 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications