భారీ నష్టాలతో ప్రారంభమై, లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు: బ్యాంక్, మెటల్ జంప్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను కలవరపెడుతోంది. ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీంతో నేడు మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. కీలక రంగాలు నేడు ప్రారంభంలో నష్టపోయాయి. గంటన్నర తర్వాత కాస్త లాభాల్లోకి వచ్చాయి.

నష్టాల నుండి లాభాల్లోకి...
సెన్సెక్స్ ఉదయం 47,863.81 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,265.39 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 47,743.43 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ 116.24 (0.24%) పాయింట్లు ఎగిసి 48,199.51 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో 48,000 దిగువకు పడిపోయినప్పటికీ, ఆ తర్వాత ఈ మార్కు దాటింది. నిఫ్టీ 14,326.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,461.15 వద్ద గరిష్టాన్ని, 14,319.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12 సమయానికి నిఫ్టీ 21.20 (0.15%) పాయింట్లు ఎగిసి 14,427.35 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం వరకు టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 4.28 శాతం, NTPC 2.78 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.54 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.30 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.80 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా 1.57 శాతం, బ్రిటానియా 1.60 శాతం, HUL 1.23 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.19 శాతం, శ్రీసిమెంట్స్ 1.12 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, HDFC బ్యాంకు, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.12 శాతం, నిఫ్టీ 50 స్టాక్స్ 1.00 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.01 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.53 శాతం, నిఫ్టీ ఐటీ 0.18 శాతం, నిఫ్టీ ఫార్మా 0.61 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.21 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ బ్యాంకు 0.79 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.13 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.57 శాతం, నిఫ్టీ మీడియా 0.24 శాతం, నిఫ్టీ మెటల్ 0.33 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.55 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.87 శాతం లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications