రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, అక్కడి పరిణామాలు, ఇతర అంశాల ప్రభావంతో రెండు రోజులుగా మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. నిన్న భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు, నేడు అదే దూకుడుతో ప్రారంభమయ్యాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు చేతులెత్తేసినట్లుగా వార్తలు రావడం, రష్యాపై చమురు ఆంక్షలకు సంబంధించి ఐరోపా దేశాలు అమెరికాతో కలిసి రాకపోవడం, దేశీయంగా ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా ఉండటం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. ప్రధానంగా కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.

500 పాయింట్ల లాభాల్లోకి...
సెన్సెక్స్ నేడు ఉదయం 53,793.99 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,918 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,367 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.10.06 సమయానికి 424 పాయింట్లు లాభపడి 53,849 పాయింట్ల వద్ద, నిఫ్టీ 115 పాయింట్లు ఎగిసి 16,129 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ ఓ సమయంలో దాదాపు 500 పాయింట్లు లాభపడింది. ఎయిర్ లైన్, ఫార్మా, ఐటీ స్టాక్స్ సహా అన్ని రంగాల్లో లాభాల్లోనే కనిపిస్తున్నాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ 1 శాతం చొప్పున ఎగిశాయి. ఫార్మా, ఐటీ రంగాలు ఒక శాతం చొప్పున, మెటల్ 0.5 శాతం లాభపడింది.

దేశీయ మార్కెట్ లాభాల్లో
అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. గత ఇరవై నాలుగు గంటల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 130 డాలర్లు క్రాస్ చేసింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 125 డాలర్లు క్రాస్ చేసింది. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై కనిపిస్తోంది. అయితే ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా కదులుతున్నాయి. దేశీయ సూచీలకు పలు సానుకూల అంశాలు కలిసి వస్తున్నాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, HDFC బ్యాంకు, HDFC, మారుతీ సుజుకీ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టెక్ మహీంద్రా, రిలయన్స్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే నిఫ్టీ, నిక్కీ, స్ట్రెయిట్ టైమ్స్, తైవాన్ వెయిటెడ్, సెట్ కాంపోజిట్, జకర్తా కాంపోజిట్ లాభాల్లో ఉండగా, హాంగ్ షెంగ్, కోస్పీ, షాంఘై కాంపోజిట్ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications