అమెరికా ఎన్నికల ఎఫెక్ట్, పడి'లేచిన' మార్కెట్లు: ఐటీ, బ్యాంకింగ్ అదుర్స్

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం (నవంబర్ 4) భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత క్రమంగా ఎగిసి, మధ్యాహ్నం ఒకటి గంటల సమయంలో 200 పాయింట్ల వరకు నష్టాల్లోకి వెళ్లి, మళ్లీ పుంజుకున్నాయి. భారీ లాభాల్లో ముగిసింది. ఉదయం 26 పాయింట్ల లాభంతో సెన్సెక్స్, 0.22 పాయింట్ల లాభంలో నిఫ్టీ ప్రారంభమైంది. సెన్సెక్స్ 355 పాయింట్లు(0.88%) లాభపడి 40,616 వద్ద, నిఫ్టీ 95 పాయింట్లు (0.80) ఎగిసి 11,908.50 పాయింట్ల వద్ద ముగిసింది. అన్ని స్టాక్స్ కూడా లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు నేడు దాదాపు 580 పాయింట్ల మేర అప్ అండ్ డౌన్ తాకింది.

అమెరికా ఫలితాలు.. ఊగిసలాట నుండి లాభాలు

అమెరికా ఫలితాలు.. ఊగిసలాట నుండి లాభాలు

అమెరికా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఎక్కువగా లాభాల్లో ఉన్నప్పటికీ, ఊగిసలాటలో కనిపించాయి. మొదట డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ గెలుస్తారనే అంచనాలు రావడంతో పుంజుకున్న మార్కెట్లు, ట్రంప్ కూడా రేసులోకి వచ్చి, ఫలితాలు ఉత్కంఠగా మారడంతో మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. ఓ దశలో సెన్సెక్స్ 40,675 పాయింట్లను తాకింది. మధ్యాహ్నం 40,093 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. అంటే దాదాపు 600 పాయింట్ల మేర అప్ అండ్ డౌన్ చూసింది. ఫలితాలు ఉత్కంఠగా ఉన్నప్పటికీ ఆ తర్వాత మార్కెట్లు కుదురుకున్నాయి. 40,616 పాయింట్ల వద్ద ముగిసింది.

లాభాల్లో ఐటీ స్టాక్స్

లాభాల్లో ఐటీ స్టాక్స్

టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్, రిలయన్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, హిండాల్కో, యాక్సిస్ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఉన్నాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఎస్బీఐ, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

ఎస్బీఐ రెండో త్రైమాసికం ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. లాభం 52 శాతం ఎగిసింది. ఎస్బీఐ స్టాక్ ధర 0.37 శాతం లాభపడి 205.50 వద్ద క్లోజ్ అయింది.

అదానీ పోర్ట్స్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 32 శాతం పెరిగింది. ఈ స్టాక్ ధర 2.23 శాతం ఎగిసింది.

ఐటీ స్టాక్స్ భారీగా ఎగిశాయి. టీసీఎస్ స్టాక్ 0.85 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.48 శాతం, ఇన్ఫోసిస్ స్టాక్ 3.03 శాతం, టెక్ మహీంద్ర స్టాక్ 2.22 శాతం, విప్రో స్టాక్ 2.28 శాతం, మైండ్ ట్రీ స్టాక్ 1.18 శాతం, కోఫోర్జ్ స్టాక్ 2.46 శాతం పెరిగింది.

రెండు రోజుల రిలయన్స్ నష్టానికి బ్రేక్

రెండు రోజుల రిలయన్స్ నష్టానికి బ్రేక్

సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ, రిలయన్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.

ఎస్బీఐ స్టాక్ ఓ సమయంలో నేటి కనిష్టం నుండి 4 శాతానికి పైగా లాభపడ్డాయి.

రెండు రోజులుగా నష్టాల్లో ఉన్న రిలయన్స్ షేర్ ఈ రోజు 3.25 శాతం లాభపడి 1910.50 వద్ద క్లోజ్ అయింది.

సన్ ఫార్మా రెండు శాతం ఎగిసింది.

నిఫ్టీ ఆటో 0.67 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.35 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.69 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.29 శాతం, నిఫ్టీ ఐటీ 1.78 శాతం, నిఫ్టీ మీడియా 0.17 శాతం, నిఫ్టీ ఫార్మా 2.18 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.26 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.40 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.08 శాతం, నిఫ్టీ మెటల్ 0.31శాతం, నిఫ్టీ రియాల్టీ 1.85 శాతం నష్టపోయాయి.

ఐటీ, ఫార్మా స్టాక్స్ మార్కెట్ భారీ లాభాలకు కారణమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+