ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు (మే 5 బుధవారం) భారీ లాభాల్లో ప్రారంభమై, అదే దూకుడుతో కొనసాగాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ షెడ్యూల్ లేనప్పటికీ మీడియా ముందుకు వస్తారని వార్తలు రావడంతో సూచీలు సానుకూలంగా కదిలాయి. ఆర్బీఐ గవర్నర్ ప్రసంగం సమయంలోను సెన్సెక్స్, నిఫ్టీ పైపైకి లేచాయి. ఉదయం నుండి స్వల్పంగా, పైకి కిందకు కదిలినప్పటికీ, మొత్తానికి భారీ లాభాల్లోనే ఉన్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. కానీ కేంద్రం చర్యలు, ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో సానుకూలంగా కదిలాయి.

భారీ లాభాల్లో..
సెన్సెక్స్ నేడు 48,569.12 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,667.14 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,254.32 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1.15 సమయానికి సెన్సెక్స్ 452 (0.94%) పాయింట్లు ఎగిసి 48,705 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,604.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,616.10 వద్ద గరిష్టాన్ని, 14,506.60 వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1.30 సమయానికి నిఫ్టీ 114.50 (0.79%) పాయింట్లు ఎగిసి 14,611 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో సన్ ఫార్మా 5.61 శాతం, UPL 3.64 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.34 శాతం, సిప్లా 2.28 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.19 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 3.28 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.92 శాతం, HUL 0.73 శాతం, SBI లైఫ్ ఇన్సురా 0.64 శాతం, గ్రాసీమ్ 0.55 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, సన్ ఫార్మా ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.74 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.66 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.50 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.37 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.51 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.92 శాతం, నిఫ్టీ ఐటీ 0.95 శాతం, నిఫ్టీ మీడియా 0.50 శాతం, నిఫ్టీ మెటల్ 0.87 శాతం, నిఫ్టీ ఫార్మా 4.00 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు మాత్రమే 1.66 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.36 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.03 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.24 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications