వరుసగా మూడోరోజు... భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 350 పాయింట్లు డౌన్
స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 60,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ద భయాలు తగ్గడం, చమరు ధరలు తగ్గడం వంటి వివిధ అంశాలు ప్రభావం చూపి సెన్సెక్స్ ఇటీవల 60,000 పాయింట్లను దాటింది. కానీ నిన్న ఈ మార్కు దిగువన ముగిసింది. నేడు మరింత క్షీణించి 59,100 స్థాయికి చేరుకుంది. దీంతో మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ఉన్నాయి.
ఉక్రెయిన్, శ్రీలంక సహా పలు దేశాల్లో నెలకొన్న అనిశ్చితి, చమురు ధరలు మళ్లీ పెరగడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్ బలహీనతకు కారణమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం. ఇది భారత్ సహా ఆసియా మార్కెట్లపై కనిపిస్తోంది. డాలర్ మారకంతో రూపాయి 75.76 వద్ద ట్రేడ్ అవుతోంది.

సెన్సెక్స్ ఉదయం 59,402 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,402 పాయింట్ల వద్దే గరిష్టాన్ని తాకింది. 59,120 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 347 పాయింట్లు క్షీణించి 59,263 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 91 పాయింట్లు క్షీణించి 17,716 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications