For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Market Crash: అమెరికా అమ్మకాలతో కుప్పకూలిన ఇండియా మార్కెట్లు.. అసలు ఏమైంది..?

|

Stock Market: నిన్న మంచి లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం ముదురుతున్న తరుణంలో అక్కడి మార్కెట్లు అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆ ప్రభావం మన మార్కెట్లపై పడింది.

ఉదయం 9.15 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 214 నష్టపోయి పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 71 పాయింట్ల నష్టాల వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ బ్యాంక్ సూచీ 217 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 110 పాయింట్ల నష్టపోయాయి. మార్కెట్లు ప్రధానంగా ప్రీ ఓపెన్ సెషన్లో నష్టాలను కొనసాగిస్తున్నాయి

 Market Crash

ప్రధానంగా అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటం అంతర్జాతీయ మార్కెట్లను తీవ్రంగా ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఇదే సమయంలో ఆయిల్ ధరలు యూరోపియన్ మార్కెట్లను నడిపించగా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అయితే ఆసియా మార్కెట్లు మాత్రం కొంత ఊరటలో ట్రేడింగ్ ప్రారంభించాయి. అమెరికా, ఆసియా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నందున దేశీయ మార్కెట్లు సైతం ప్రభావితం అవుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.

ఎన్ఎస్ఈ సూచీలో బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, యూపీఎల్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, అపోలో హాస్పిటల్స్, సిప్లా, నెస్లే, హెచ్డీఎఫ్సీ లైఫ్, భారతీ ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

ఇదే క్రమంలో హిందాల్కొ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటానియా, ఓఎన్జీసీ, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, రిలయన్స్, సన్ ఫార్మా, ఐటీసీ, కోల్ ఇండియా, విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఎల్ టి కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.

English summary

Market Crash: అమెరికా అమ్మకాలతో కుప్పకూలిన ఇండియా మార్కెట్లు.. అసలు ఏమైంది..? | Indices in indian markets started negative amid selloff in US, Asia markets with banking fears

Indices in indian markets started negative amid selloff in US, Asia markets with banking fears
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X