ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు సోమవారం (జూన్ 7) లాభాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం, రుతుపవనాల పురోగతి ఆశాజనకంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపరిచి, మార్కెట్లకు అండగా నిలుస్తున్నాయి. సెన్సెక్స్ 30లో కొన్నిమినహా మిగతా స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి.

లాభాల్లో సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 52,231.38 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,279.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,054.76 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.2.30 సమయానికి 244.85 (0.47%) పాయింట్లు ఎగిసి 52,338.48 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 15,725.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,725.10 వద్ద గరిష్టాన్ని, 15,678.10 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మధ్యాహ్నం గం.2.30 సమయానికి 91.90 (0.59%) పాయింట్లు లాభపడి 15,762.75 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 5.65 శాతం, టాటా మోటార్స్ 4.15 శాతం, ఎన్టీపీసీ 3.53 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.05 శాతం, శ్రీ సిమెంట్స్ 2.98 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 4.48 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.75 శాతం, HDFC 1.06 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.54 శాతం, సిప్లా 0.52 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టాటా స్టీల్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.60 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.49 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.12 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.54 శాతం నిఫ్టీ ఎనర్జీ 1.75 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.50 శాతం, నిఫ్టీ ఐటీ 1.11 శాతం, నిఫ్టీ మీడియా 1.59 శాతం, నిఫ్టీ మెటల్ 0.07 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.51 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.20 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.00 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.14 శాతం, నిఫ్టీ ఫార్మా 0.03 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications