కేంద్రం ప్యాకేజీ, లాక్ డౌన్ పొడిగింత: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ మార్కెట్లను సంతృప్తిపరచలేకపోయాయి. మరోవైపు, కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్‌ను మే 31వ తేదీ వరకు పొడిగించారు. దీంతో సోమవారం (మే 18) మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 130.47 పాయింట్లు లేదా 0.42% నష్టపోయి 30,967.26, నిఫ్టీ 42.50 పాయింట్లు లేదా 0.47% నష్టపోయి 9,094.35 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 525 షేర్లు లాభాల్లో, 293 షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించగా, 58 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
డాలర్ మారకంతో భారత రూపాయి శుక్రవారం 75.57 వద్ద క్లోజ్ కాగా, ఈ రోజు 27 పైసలు నష్టపోయి 75.84 వద్ద ప్రారంభమైంది. దాదాపు అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 6 శాతం కోల్పోయింది. ఆటో, మెటల్ రంగాలు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో సిప్లా, భారతీ ఇన్ఫ్రాటెల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, వేదాంత ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, జీ ఎంటర్టైన్మెంట్, యాక్సిస్ బ్యాంకు, మారుతీ సుజుకీ ఉన్నాయి.


Click it and Unblock the Notifications