ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్లకు పైగా లాభపడింది. రెండు రోజుల నష్టాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతుండడం కలిసి వచ్చింది. అలాగే ఇటీవల దేశంలో వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, దేశీయంగా కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇక డాలర్ మారకంతో రూపాయి 73.02 వద్ద ట్రేడ్ అయింది.

సూచీలు జంప్
సెన్సెక్స్ 49,833.98 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,320.46 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,832.72 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.12 సమయానికి 716.20 (1.44%) పాయింట్లు ఎగిసి 50,281.06 పాయింట్లు వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,987.80 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,118.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,985.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12 సమయానికి 199.60 (1.34%) పాయింట్లు ఎగిసి 15,105 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 3.44 శాతం, HDFC బ్యాంకు 2.86 శాతం, ICICI బ్యాంకు 2.40 శాతం, HDFC 2.23 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.83 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 0.85 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.35 శాతం, గ్రాసీమ్ 0.32 శాతం, ఐవోసీ 0.24 శాతం, ఐచర్ మోటార్స్ 0.14 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, HDFC బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా...
గత రెండు రోజుల నష్టాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అలాగే, ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం సూచీలకు కలిసి వచ్చింది.
నిఫ్టీ 50 స్టాక్స్ 1.24 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.84 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.59 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.14 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.71 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.89 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.51 శాతం, నిఫ్టీ ఐటీ 0.77 శాతం, నిఫ్టీ మీడియా 2.10 శాతం, నిఫ్టీ మెటల్ 0.46 శాతం, నిఫ్టీ ఫార్మా 0.18 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.03 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.51 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.20 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications