భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, ప్రాఫిట్ బుకింగ్ కొనసాగింపు...
ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 350 పాయింట్ల మేర పతనమైంది. సూచీ నిన్న భారీ లాభాల్లో ప్రారంభమై, రోజంతా ఊగిసలాటలో కనిపించి, చివరకు దాదాపు స్థిరంగా ముగిశాయి. నేడు నష్టాల్లో ఉన్నాయి. నేడు మొత్తం 23 కంపెనీలు ఫలితాలను వెల్లడిస్తున్నాయి.
వీటిల్లో మదర్సన్ సుమీ, ఎంటీఏఆర్ టెక్నాలజీస్, ముత్తూట్ ఫినాన్స్, పీవీఆర్ తదితర కంపెనీలు ఉన్నాయి. అమెరికాలో తయారీ రంగం పుంజుకొన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో డౌజోన్స్ లాభాల్లో ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి విలువ 16 పైసలు పతనమై రూ.72.44 వద్ద ట్రేడ్ అయింది.

భారీ నష్టాల్లో సూచీలు
సెన్సెక్స్ నేడు ఉదయం 51,749.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,863.94 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,863.94 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.10.44 సమయానికి -322.31 (0.62%) పాయింట్లు ఎగిసి 51,612.57 పాయింట్ల వద్ద కదలాడింది.
నిఫ్టీ 15,520.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,564.05 వద్ద గరిష్టాన్ని, 15,488.50 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ ఉదయం గం.10.50 సమయానికి 76.55 (0.49%) పాయింట్లు నష్టపోయి 15,498.30 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ నిన్న చాన్నాళ్లకు 52వేల పాయింట్లు దాటింది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే నష్టాల్లో కదలాడుతున్నాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 2.56 శాతం, టాటా స్టీల్ 1.47 శాతం, SBI లైఫ్ ఇన్సురెన్స్ 1.32 శాతం, శ్రీ సిమెంట్స్ 1.00 శాతం, కోల్ ఇండియా 0.91 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఐటీసీ 2.04 శాతం, టెక్ మహీంద్రా 1.99 శాతం, HDFC 1.23 శాతం, ఇన్ఫోసిస్ 1.11 శాతం, TCS 1.01 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, ఐటీసీ, రిలయన్స్, టాటా స్టీల్, SBI ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.41 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.92 శాతం లాభపడింది. నిఫ్టీ బ్యాంకు 0.37 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.45 శాతం, నిఫ్టీ మీడియా 0.24 శాతం, నిఫ్టీ మెటల్ 1.17 శాతం, నిఫ్టీ ఫార్మా 0.66 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.29 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.23 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.23 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.35 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.50 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.27 శాతం, నిఫ్టీ ఐటీ 1.20 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications