ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (మే 12) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 150 పాయింట్లకు పైగా పతనమైంది. ఆ తర్వాత కాస్త తేరుకున్నప్పటికీ భారీ నష్టాల్లోనే ఉన్నాయి. కమొడిటీ ధరలు దూసుకెళ్తుండటంతో ద్రవ్యోల్బణ భయాలు పెరిగి అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి.
అక్కడి నుండి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు ద్రవ్యోల్బణ భయం, కమొడిటీ ధరల పెరుగుదల నేపథ్యంలో కీలక వడ్డీరేట్లు, బాండ్స్ రాబడి పెరగవచ్చుననే అంచనాలతో అప్రమత్తంగా కదులుతున్నాయి. వీటికి తోడు కీలక రంగాల్లో అమ్మకాలు, కొవిడ్ భయాలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి. కరోనా నేపథ్యంలో తైవాన్ సూచీలు నాలుగు శాతం మేర నష్టపోయాయి.

భారీ నష్టాల్లో మార్కెట్లు
సెన్సెక్స్ నేడు ఉదయం 49,171.28 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,171.28 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,629.38 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ -340.13 (0.69%) పాయింట్లు నష్టపోయి 48,821.42 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 97.10 (0.65%) పాయింట్లు క్షీణించి 14,753.65 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,823.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,824.05 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,695.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 2.95 శాతం, NTPC 2.66 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.57 శాతం, లార్సన్ 1.91 శాతం, ఐవోసీ 1.16 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 2.54 శాతం, HUL 2.44 శాతం, టెక్ మహీంద్రా 2.23 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.17 శాతం, గ్రాసీమ్ 2.06 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, రిలయన్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.66 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.15 నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంకు 0.68 శాతం, నిఫ్టీ ఫైనాన్ియల్ సర్వీసెస్ 0.81 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.02 శాతం, నిఫ్టీ ఐటీ 1.10 శాతం, నిఫ్టీ మెటల్ 0.20 శాతం, నిఫ్టీ ఫార్మా 0.16 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.85 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ ఆటో 0.04 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.27 శాతం, నిఫ్టీ మీడియా 0.73 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 4.16 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.11 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications