నిర్మల ప్యాకేజీ తేలిపోయింది.. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో, దలాల్ స్ట్రీట్ నష్టాల్లో
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలలో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 9,100 కిందకు పడిపోయింది. సెన్సెక్స్ 115.98 పాయింట్లు లేదా 0.37% నష్టంతో 31,006.91 పాయింట్ల వద్ద, నిఫ్టీ 32.00 పాయింట్లు కోల్పోయి లేదా 0.35% నష్టపోయి 9,110.75 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 477 షేర్లు లాభాల్లో, 192 నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. 40 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 74.81 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దీన ప్యాకేజీ మార్కెట్లకు ఏమాత్రం రుచించలేదు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించి మార్కెట్లు మరింత వేచి చూసే ధోరణిలో ఉన్నాయని అంటున్నారు. అందుకే రెండు రోజులుగా ఊగిసలాటలో ఉన్నాయని చెబుతున్నారు. టాప్ గెయినర్స్ జాబితాలో బీపీసీఎల్, ఎన్టీపీసీ, సిప్లా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఇన్ఫ్రాటెల్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతీ సుజుకీ ఉన్నాయి.

గురువారం అమెరికా మార్కెట్లో లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు అదే దిశలో సాగుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక ప్యాకేజీ ప్రకటన మాత్రం ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోయింది. నిన్న సెన్సెక్స్ 885.72 పాయింట్లు లేదా 2.77% క్షీణించి 31,122.89 వద్ద ముగిసింది. నిఫ్టీ 240.80 పాయింట్లు లేదా 2.57% కోల్పోయి 9,142.75 వద్ద క్లోజ్ అయింది. ఓ దశలో సెన్సెక్స్ 955 పాయింట్లకు పైగా నష్టపోయింది. టెక్ మహీంద్రా షేర్ వ్యాల్యూ అత్యధికంగా 5.24% పతనమైంది.


Click it and Unblock the Notifications