స్టాక్ మార్కెట్లు మంగళవారం (జూన్ 1) భారీ లాభాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం సమయానికి నష్టాల్లోకి జారుకున్నాయి. దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం, అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, వ్యాక్సినేషన్ పురోగతి, కీలక కంపెనీలు రాణించడం ప్రారంభంలో సూచీలను ముందుకు కదిలించాయి. నిన్న జీడీపీ గణాంకాలు విడుదలయ్యాయి. సెకండ్ వేవ్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని, కానీ ఫస్ట్ వేవ్ అంతగా ఉండదని డేటా వెల్లడించింది. అయితే కరోనా కేసులు మళ్లీ కొద్దిగా పెరగడం, వివిధ రాష్ట్రాల లాక్ డౌన్ ఆంక్షలపై సంధిగ్దత నేపథ్యంలో సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి.

లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నష్టాల్లోకి...
సెన్సెక్స్ నేడు ఉదయం 52,067.51 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,228.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,836.16 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.11.30 సమయానికి 2.24 (0.0043%) పాయింట్లు ఎగిసి 51,939.68 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 15,629.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,660.75 వద్ద గరిష్టాన్ని, 15,539.70 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ ఉదయం గం.11.30 సమయానికి 17.45 (0.11%) పాయింట్లు నష్టపోయి 15,565.35 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ చాన్నాళ్లకు 52వేల పాయింట్లు దాటింది. ప్రధానంగా సూచీలు భారీగా ఎగిసిపడటంతో ప్రాఫిట్ బుకింగ్‌కు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ప్రారంభంలో భారీగా లాభపడి ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. అంతలో కోలుకున్నప్పటికీ 52వేలకు దిగువన ఉంది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ongc 3.26 శాతం, బజాజ్ ఆటో 1.91 శాతం, HDFC 1.26 శాతం, SBI 0.91 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.91 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్ 3.17 శాతం, JSW స్టీల్ 2.93 శాతం, గ్రాసీమ్ 1.84 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.75 శాతం, ICICI బ్యాంకు 1.64 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఎస్బీఐ, టాటా స్టీల్, hdfc, టాటా మోటార్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.16 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.51 శాతం నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఎనర్జీ 0.27 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.05 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.52 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.54 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.30 శాతం, నిఫ్టీ ఐటీ 0.36 శాతం, నిఫ్టీ మీడియా 0.73 శాతం, నిఫ్టీ మెటల్ 2.25 శాతం, నిఫ్టీ ఫార్మా 0.65 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.00 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.20 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.92 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications