మార్కెట్ సరికొత్త రికార్డులు: సెన్సెక్స్ 680 పాయింట్లు జంప్: ఐటీ, ఫార్మా స్టాక్స్ పతనం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (నవంబర్ 10) భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఫార్మా స్టాక్స్ భారీగా నష్టపోగా, ఇతర రంగాలు భారీ లాభాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 680.22 పాయింట్లు(1.60%) లాభపడి 43,277.65 పాయింట్ల వద్ద, నిఫ్టీ 170.10 పాయింట్లు(1.37%) ఎగిసి 12,631.10 పాయింట్ల వద్ద ముగిసింది. 1,203 షేర్లు లాభాల్లో, 1,457 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 172 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోను వెనుకడుగు వేయలేదు. 43వేల మార్క్ దాటిన సెన్సెక్స్ జీవనకాల గరిష్టాన్ని తాకింది.

రిలయన్స్ స్టాక్ రూ.2,089
టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 8.89 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 7.71 శాతం, లార్సన్ 7.02 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 6.43 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 5.58 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా 6.01 శాతం, టెక్ మహీంద్ర 5.90 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 5.30 శాతం, దివిస్ ల్యాబ్స్ 4.68 శాతం, నెస్లె 4.20 శాతం నష్టపోయాయి.
నేటి యాక్టివ్ స్టాక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా రెండో త్రైమాసిక ఫలితాలు 88 శాతం క్షీణించి, నికర లాభం రూ.162 కోట్లకు పడిపోయింది.
యస్ బ్యాంకు స్టాక్ 5 శాతం ఎగిసింది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ కేర్ యస్ బ్యాంకు డెబిట్ ఇన్‌స్ట్రుమెంట్ రేటింగ్‌ను అప్ గ్రేడ్ చేసింది. దీంతో స్టాక్ లాభపడింది.
రిలయన్స్ స్టాక్ 1.87 శాతం లాభపడి రూ.2,089 వద్ద ముగిసింది. ఐదు సెషన్‌లుగా ఈ స్టాక్ క్రమంగా పుంజుకుంటోంది. రూ.2100 సమీపానికి చేరుకుంది.

ఫైనాన్షియల్, బ్యాంకింగ్ స్టాక్స్ అదుర్స్
నిఫ్టీ ఆటో 0.74 శాతం, నిఫ్టీ బ్యాంకు 3.89 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.43 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 4.11 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.13 శాతం, నిఫ్టీ మీడియా 1.04 శాతం, నిఫ్టీ మెటల్ 0.45 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.66 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.06 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 3.74 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు, ఫైనాన్షియల్ స్టాక్స్ ఏకంగా 3 శాతం నుండి 4 శాతానికి పైగా లాభపడ్డాయి.
నష్టపోయిన రంగాల్లో నిఫ్టీ ఐటీ 3.86 శాతం, నిఫ్టీ ఫార్మా 4.33 శాతం ఉన్నాయి.
ఈ వారంలో వరుసగా రెండో రోజు మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.
ఫైనాన్షియల్, బ్యాంకింగ్ మార్కెట్లు భారీ లాభాలకు దోహదపడ్డాయి.
సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కో శాతం చొప్పున ఎగిశాయి.
గత 7 సెషన్లలో నిఫ్టీ బ్యాంకు 20 శాతం, సెన్సెక్స్, నిఫ్టీ 9 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ టాప్ 10 గెయినర్స్‌లో 7 ఫైనాన్షియల్ రంగానివే.

ఫార్మా, ఐటీ భారీ పతనం
ఫార్మా, ఐటీ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. నిఫ్టీ ఐటీ 4 శాతం వరకు, నిఫ్టీ ఫార్మా 4.33 శాతం నష్టపోయింది.
టీసీఎస్ 2.66 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 5.01 శాతం, ఇన్ఫోసిస్ 3.75 శాతం, టెక్ మహీంద్ర 5.73 శాతం, విప్రో 2.51 శాతం, మైండ్ ట్రీ స్టాక్ 4.06 శాతం, కోఫోర్జ్ స్టాక్స్ 4.64 శాతం నష్టపోయాయి.
సెన్సెక్స్ 43 వేల మార్క్ దాటి, నిఫ్టీ 12600 దాటి కొత్త శిఖరాలను చేరుకుంది.


Click it and Unblock the Notifications