ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం(మే 27) ఉదయం ఊగిసలాటలో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత లాభాల్లోకి వెళ్లాయి. నేడు మొత్తం తొంబైకి పైగా కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో ఐచర్ మోటార్స్, సన్ ఫార్మా, కాడిల్లా హెల్త్ కేర్, ఐఆర్బీ ఇన్ఫ్రా, బోరోసిల్, డైయాక్సిన్ టెక్నాలజీస్, పేజ్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు ఉన్నాయి. బాండ్ ఈల్డ్ సమస్యలను పరిష్కరిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడంతో నిన్న అక్కడి సూచీలు లాభపడ్డాయి. డౌజోన్స్ 0.03 శాతం, ఎస్ & పీ 500 సూచీ 0.19 శాతం, నాస్‌డాక్ 0.59 శాతం లాభపడ్డాయి.

స్వల్ప లాభాల్లో సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 51,128.80 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,178.77 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,917.59 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.30 సమయానికి 149.27 (0.29%) పాయింట్లు ఎగిసి 51,166.79 పాయిట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 15,323.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,356.70 వద్ద గరిష్టాన్ని, 15,278.60 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మధ్యాహ్నం +52.95 (0.35%) పాయింట్లు లాభపడి 15,354.40 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో 2.12 శాతం, టాటా మోటార్స్ 1.76 శాతం, బజాజ్ ఆటో 1.47 శాతం, హీరో మోటో కార్ప్ 1.52 శాతం, టీసీఎస్ 1.47 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 0.97 శాతం, సిప్లా 0.88 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 0.73 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.67 శాతం, HUL 0.62 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో BPCL, టాటా మోటార్స్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.29 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.31 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.72 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.15 శాతం నిఫ్టీ ఎనర్జీ 0.43 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.13 శాతం, నిఫ్టీ ఐటీ 1.51 శాతం, నిఫ్టీ మెటల్ 0.43 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.19 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.25 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.15 శాతం, నిఫ్టీ మీడియా 0.32 శాతం, నిఫ్టీ ఫార్మా 0.16 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.46 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications