ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (మే 26) స్తబ్దుగా ప్రారంభమై, ఆ తర్వాత భారీ లాభాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 300 పాయింట్లకు పైగా లాభాల్లోకి వెళ్లింది. నిఫ్టీ 80 పాయింట్లకు పైగా ఎగిసింది. సెన్సెక్స్ 52,000 పాయింట్ల దిశగా ట్రేడ్ అయింది. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదులుతున్నాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు మార్కెట్ పుంజుకోవడానికి దోహదపడింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.72.75 వద్ద ట్రేడ్ అయింది.

స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 50,899.58 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,990.87 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,620.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.12 సమయానికి 334.58 (0.66%) పాయింట్లు ఎగిసి 333.28 (0.66%) పాయింట్లు ఎగిసి 50,970.81 పాయిట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 15,257.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,304.75 వద్ద గరిష్టాన్ని, 15,194.95 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మధ్యాహ్నం +89.75 (0.59%) పాయింట్లు లాభపడి 15,298.20 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్ 3.10 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.50 శాతం, గ్రాసీమ్ 2.41 శాతం, టైటాన్ కంపెనీ 1.82 శాతం, యూపీఎల్ 1.63 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్ 2.12 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.04 శాతం, JSW స్టీల్ 2.05 శాతం, హిండాల్కో 1.14 శాతం, బ్రిటానియా 0.59 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో SBI, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, JSW స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.57 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.55 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.68 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.46 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.55 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.17 శాతం, నిఫ్టీ ఐటీ 1.15 శాతం, నిఫ్టీ మీడియా 2.35 శాతం, నిఫ్టీ ఫార్మా 0.35 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.63 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.95 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.33 శాతం లాభపడ్డాయి. కేవలం నిఫ్టీ ఎనర్జీ మాత్రమే 0.30 శాతం నష్టపోయింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications