దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలపై ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. బుధవారం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. యుద్ధం రోజురోజుకు బీకరంగా మారుతుండటంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు నేడు ఏకంగా 6.59 శాతం ఎగిసి 111.55 డాలర్లు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 6.51 శాతం ఎగిసి 110 డాలర్లకు చేరుకుంది. చమురు ధరలు నేడు ఒక్కరోజే దాదాపు 7 శాతం మేర ఎగిశాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు దేశీయ, అంతర్జాతీయ సూచీలు కుప్పకూలుతున్నాయి.

నష్టాల్లో మార్కెట్లు
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ద్రవ్యోల్భణ భయాలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పాశ్చాత్య దేశాలు రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడినట్లు తెలుస్తోంది. రష్యా కరెన్సీ రూబుల్ వ్యాల్యూ క్షీణించింది. ఆ రెండు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత కంపెనీల ఆదాయాలపై ప్రభావం ఉంటుంది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా కదులుతున్నాయి. అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగిశాయి. ఐరోపాలోని యూకే, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు కూడా కుంగిపోయాయి. నేడు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.

1100 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు భారీగా తగ్గింది. సెన్సెక్స్ నేడు 55,629 పాయింట్ల వద్ద ప్రారంభమై, 55,755 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 55,074 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తగ్గింది. నిఫ్టీ 16,593 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,678 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,508 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12.45 సమయానికి సెన్సెక్స్ 1116 పాయింట్లు క్షీణించి 55,130 పాయింట్ల వద్ద, నిఫ్టీ 286 పాయింట్లు తగ్గి 16,508 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేడు అన్ని రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి. ఫైనాన్షియల్స్, ఆటో స్టాక్స్ భారీగా దెబ్బతిన్నాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా, టాటా స్టీల్, హిండాల్కో, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, HDFC లైఫ్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో మారుతీ సుజుకీ, ఏషియన్ పేయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంకు, HDFC బ్యాంకు ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications