ఊగిసలాట నుండి భారీ లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 250 పాయింట్లు జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (మే 6) ప్రారంభంలో లాభనష్టాల ఊగిసలాటలో కనిపించి, మధ్యాహ్నానికి లాభాల్లోకి ఎగిశాయి. మధ్యాహ్నం గం.12 వరకు భారీ ఊగిసలాట ధోరణి కనిపించింది. ఆ తర్వాత మాత్రం అంతకంతకూ ఎగిసి మధ్యాహ్నం గం.1 సమయానికి 275 పాయింట్ల లాభాల్లో కనిపించింది. నిన్న ఆర్బీఐ చర్యలు, అంతర్జాతీయ, ఆసియా మార్కెట్ సానుకూలతలు కలిసి వచ్చాయి. అలాగే వ్యాక్సినేషన్ వేగవంతం ఇన్వెస్టర్ల సెంటిమెంటును కాస్త బలపరిచింది. దీంతో సూచీలు ఎగిశాయి.

ఊగిసలాట నుండి భారీ లాభాల్లో...
సెన్సెక్స్ నేడు 48,877.78 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,980.69 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,614.11 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.1.15 సమయానికి 243.34 (0.50%) పాయింట్లు ఎగిసి 48,921 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,668.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,725.05 వద్ద గరిష్టాన్ని, 14,611.50 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మధ్యాహ్నం గం.1.15 సమయానికి 86.60 (0.59%) పాయింట్లు ఎగిసి 14,705 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేడు మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో 3.94 శాతం, హిండాల్కో 3.60 శాతం, హీరో మోటో కార్ప్ 3.51 శాతం, బజాజ్ ఆటో 2.55 శాతం, ఐచర్ మోటార్స్ 2.21 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్ 1.84 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.81 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.15 శాతం, సన్ ఫార్మా 1.11 శాతం, ONGC 0.86 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, సిప్లా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.46 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.62 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.28 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.04 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.48 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.50 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.17 శాతం, నిఫ్టీ ఐటీ 0.17 శాతం, నిఫ్టీ మీడియా 0.17 శాతం, నిఫ్టీ మెటల్ 1.83 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.66 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఫార్మా 0.78 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.26 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.01 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications