లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు, ఆసియా మార్కెట్ మిశ్రమంగా
గతవారం లాభపడిన స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రారంభ సెషన్‌తోనే సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్‌లు మిశ్రంగా కదలాడుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌లోని లాభాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఈ వారమే వెలువడనున్న ఫెడ్ వడ్డీ రేట్లపై ఇన్వెస్టర్ల దృష్టి, అమెరికా ద్రవ్యోల్భణం నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరుకోవడంతో వడ్డీ రేటు పెంచే సంకేతాలు ఉండటం వంటి అంశాలు మార్కెట్ పైన ప్రభావం చూపుతున్నాయి.
డాలర్ మారకంతో రూపాయి కదలిక, FII పెట్టుబడులు బయటకు వెళ్లడం, ముడి చమురు ధరల నుండి కూడా సానుకూల సంకేతాలు ఉన్నాయి. వచ్చే శుక్రవారం హోలీ సందర్భంగా సెలవు. కాబట్టి ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులు పని చేస్తాయి.

సెన్సెక్స్ నేడు 55,614 పాయింట్ల వద్ద ప్రారంభమై, 55,936 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 55,556 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.11.15 సమయానికి 427 పాయింట్లు ఎగిసి 55,978 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ నేడు ఉదయం 16,633 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,727 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,606 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 92 పాయింట్లు ఎగిసి 16,721 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
నేటి ప్రారంభ సెషన్‌లో బ్యాంకు, ఐటీ స్టాక్స్ లాభాల్లో ఉండగా, ఆటో, రియాల్టీ, మెటల్ స్టాక్స్ నష్టపోయాయి. ఉదయం టాప్ గెయినర్స్ జాబితాలో HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఐవోసీ, బీపీసీఎల్, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, హిండాల్కో ఉన్నాయి.


Click it and Unblock the Notifications