Trade Deficit: జూలై మాసంలో భారత వాణిజ్య లోటు తగ్గి 20.67 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో ఇండియా ఎగుమతులు భారీగా క్షీణించాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
ఈ క్రమంలో భారత దిగుమతుల విలువ 52.92 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఎగుమతులు కేవలం 32.25 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలానికి వాణిజ్య లోటు 25.43 బిలియన్ డాలర్లుగా ఏడాది ప్రాతిపదికన ప్రస్తుతం తగ్గుదల నమోదైంది. జూన్‌లో వాణిజ్య లోటు మేలో 22.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే జూన్‌లో 20.13 బిలియన్ డాలర్లకు తగ్గింది. అయితే జూలైలో జూన్ సంఖ్యల కంటే స్వల్ప పెరుగుదల కనిపించింది.

రాయిటర్స్ పోల్స్ ప్రకారం ఆర్థిక నిపుణులు జూలై మాసానికి 21 బిలియన్ డాలర్ల ఆర్థిక లోటును అంచనా వేశారు. ప్రస్తుతం నమోదైన సంఖ్యలు సైతం దాదాపుగా వారు అంచనాలకు దగ్గరగానే నమోదయ్యాయి. సరుకుల వాణిజ్య ఎగుమతులు జూలైలో 9 నెలల కనిష్ట స్థాయి 32.25 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఏప్రిల్-జూలైలో వస్తువుల ఎగుమతుల వృద్ధి సంవత్సరానికి 14.50 శాతం మేర పడిపోయింది. ఇదే కాలానికి దిగుమతులు 13.79 శాతం పడిపోయాయి.
ఎగుమతుల్లో ప్రధానంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇనుప ఖనిజం, మందులు, ఫార్మా వంటి రంగాల ద్వారా నడపబడుతున్నాయి. ఏప్రిల్-జూలైలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు ఏడాదికి 11.41 శాతం క్షీణించాయి. నాలుగు నెలల కాలంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఏడాదితో పోలిస్తే 3.68 శాతం మేర తగ్గాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications