ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఒక కార్పొరేట్ బిజినెస్ లాగ మారింది. ఇందుకు కారణం భూముల ధరలు పెరగటం ఇంకా పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఇళ్ల స్థలాలు, వ్యాపారం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే రియల్ ఎస్టేట్ రంగానికి కోవిడ్-19 మహమ్మారి కాలం ఎప్పటికి మర్చిపోని గుర్తుల ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో వివిధ కారణాల వల్ల రియల్ ఎస్టేట్ డీలా పడిపోవడం, అంతరాయాలు ఏర్పడ్డ ఆ తర్వాత మంచి అభివృద్ధి, అమ్మకాలు జరిగాయి.
కరోనా తరువాత ఇండియాలోని ప్రాపర్టీ డెవలపర్‌లు, ఇతర పరిశ్రమల వాటాదారులు ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఆశతో ఉన్నారు. ఇందుకు కారణం వేగంగా నగరాల విస్తరణ, అభివృద్ధి పనులు, ప్రస్తుత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మారుతున్న నగరాలపై పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.

రియల్ ఎస్టేట్ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్ వ్యవస్థాపకుడు & చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ మాట్లాడుతూ, పెరుగుతున్న అర్బనైజేషన్, మారుతున్న లైఫ్ స్టయిల్, ప్రీమియం & లగ్జరీ విభాగాల్లో పెరుగుతున్న డిమాండ్‌తో 2024లో భారతీయ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుందని చెప్పారు. ఇళ్లకు డిమాండ్ ముఖ్యంగా బలంగా ఉంది, అయితే లగ్జరీ మార్కెట్లో ఎక్కువ విలువ ఉన్న ఇంకా గురుగ్రామ్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో అత్యాధునిక సౌకర్యాలపై ఇంట్రెస్ట్ చూపుతున్న నాన్-రెసిడెంట్ భారతీయుల (NRIలు) నుండి డిమాండ్ ఉందని" అని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి ప్రకారం, కోవిడ్ తర్వాత భారతదేశ హౌసింగ్ మార్కెట్ మంచి రికవరీని చూసింది, 2024 మొదట్లో అత్యధిక అమ్మకాల స్థాయికి చేరుకుంది. ఈ ట్రెండ్ తరువాత కాలంలో కొనసాగే అవకాశం కూడా ఉంది అని అన్నారు.
బిల్డర్లు హై-ఎండ్, లగ్జరీ ప్రాపర్టీలపై దృష్టి పెట్టడం ద్వారా మారుతున్న అభిరుచులకు అనుగుణంగా మారుతున్నారని, దీంతో ఈ సెగ్మెంట్లలో కొత్త ఆఫర్లు పెరిగాయని పూరీ చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి మొదటి వేవ్ 2020 నుండి భారతదేశంలో గృహాల మార్కెట్ 2024లో కొత్త గరిష్టాలను తాకింది. రియల్ ఎస్టేట్ సేవల సంస్థ JLL డేటా ప్రకారం, 2024 మొదటి తొమ్మిది నెలల్లో టాప్ 7 మార్కెట్‌లు అత్యధికంగా 229,908 యూనిట్ల అమ్మకాలు, సంవత్సరానికి 17% వృద్ధి. రిజిస్టర్ చేశాయి.
రియల్ ఎస్టేట్ కంపెనీ గౌర్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందజేస్తూ ప్రముఖ డెవలపర్‌ల ద్వారా పెద్ద స్థలాలు, ఐకానిక్ ప్రాజెక్ట్‌ల వైపు కూడా మార్పు జరుగుతోందని చెప్పారు. 2018లో కరోనా కంటే ముందే ప్రారంభమైన మార్కెట్ కన్సాలిడేషన్ కూడా గత కొన్ని సంవత్సరాలుగా వేగం పుంజుకుంది, ఆ ట్రెండ్ మరింత వేగవంతం కానుంది, అని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (CREDAI) నేషనల్ ఛైర్మన్‌గా కూడా ఉన్న గౌర్ చెప్పారు.


Click it and Unblock the Notifications