భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు.. RBI గవర్నర్ హెచ్చరిక.. రెండు అతిపెద్ద రిస్కులు ఇవే..

భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి, ద్రవ్యోల్బణ పరిస్థితులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు ఆర్థిక వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు ప్రధానంగా రెండు అంతర్జాతీయ, వాతావరణ ఆధారిత అంశాలు ముప్పుగా పరిణమించాయని RBI స్పష్టం చేసింది. అవి పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దేశంలో అంచనాల కంటే బలహీనంగా ఉన్న రుతుపవనాలు అని చెప్పవచ్చు. ఈ రెండు ప్రధాన సవాళ్లు సుదీర్ఘకాలం పాటు ఇలాగే కొనసాగితే.. అవి కేవలం నిత్యావసర వస్తువుల ధరలపైనే కాకుండా మొత్తం భారత ఆర్థిక వృద్ధి రేటు (GDP) గమనాన్ని కూడా మందగించేలా చేయగలవని గవర్నర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం, సైనిక చర్యలు తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. భారతదేశం తన రోజువారీ ఇంధన, ముడి చమురు అవసరాలలో దాదాపు 90 శాతం భాగం విదేశీ దిగుమతులపైనే ఆధారపడి ఉందనేది గుర్తించాల్సిన ముఖ్యమైన అంశం. అందువల్ల గ్లోబల్ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు పెరిగిన ప్రతిసారీ అది దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు రవాణా వ్యయాలను, పారిశ్రామిక ఉత్పత్తి ఖర్చులను ప్రత్యక్షంగా పెంచుతుంది. ఇది అంతిమంగా సామాన్యుడు కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని హెచ్చిస్తుంది. అంతర్జాతీయంగా మారిన చమురు ధరల పూర్తి ప్రభావం ఇంకా దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణంలో పూర్తిగా ప్రతిబింబించనప్పటికీ.. ఇంధన ధరలు ఇలాగే దీర్ఘకాలం అధికంగా ఉంటే రాబోయే నెలల్లో దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని ఆర్‌బిఐ హెచ్చరించింది.

RBI Governor India Inflation Iran War Weak Monsoon India Economy GDP Growth Crude Oil Prices Food Inflation RBI News Economic Growth Business News India News RBI GDP RBI News Economy News Business News

మరోవైపు బలహీనమైన రుతుపవనాలు దేశీయ వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు అదనపు ఆందోళనగా మారాయి. భారతదేశంలో ఇప్పటికీ మెజారిటీ వ్యవసాయ భూములు నీటిపారుదల సౌకర్యాల కంటే సహజ వర్షపాతంపైనే ఆధారపడి ఉన్నాయి. దేశంలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో దాదాపు 70 శాతం రుతుపవనాల నుంచే లభిస్తుంది. ఒకవేళ రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా నమోదైతే, పంటల సాగు విస్తీర్ణం పడిపోవడంతో పాటు దిగుబడి తీవ్రంగా దెబ్బతింటుంది.

Also Read

ఇది దేశీయంగా ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి తగ్గేలా చేసి ఆహార ద్రవ్యోల్బణానికి నేరుగా దారితీస్తుంది. ఇటీవల వెలువడిన వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కలు ఆర్‌బిఐ సురక్షిత పరిమితిగా నిర్దేశించిన 4 శాతం లక్ష్యాన్ని అధిగమించడంతో.. కేంద్ర బ్యాంకు ఆహార, ఇంధన ధరల సరళిని నిశితంగా పరిశీలిస్తోంది.

ఈ క్లిష్టమైన సవాళ్లు, అనిశ్చితులు ఉన్నప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక పునాదులు (Economic Fundamentals) చాలా పటిష్టంగా ఉన్నాయని ఆర్‌బిఐ ధైర్యాన్ని ఇచ్చింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరణ ప్రకారం.. అనేక వర్ధమాన, అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలతో పోలిస్తే అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య కూడా భారత రూపాయి మార్పిడి విలువ సాపేక్షంగా స్థిరమైన ప్రదర్శనను కనబరుస్తోంది.

ఇక వడ్డీ రేట్ల విషయానికొస్తే ఆఆర్‌బిఐ తన బెంచ్ మార్క్ రేటైన రెపో రేటును (Repo Rate) మార్చకుండా 5.25 శాతం వద్ద స్థిరంగా కొనసాగించింది. బ్యాంకులకు ఆఆర్‌బిఐ ఇచ్చే రుణాలపై విధించే ఈ రేటు మారకుండా ఉండటం వల్ల గృహ, వాహన, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు తక్షణమే పెరగకుండా ఉపశమనం లభిస్తుంది. ద్రవ్య విధానాన్ని వెంటనే కఠినతరం చేయడం లేదా ముందస్తుగా వడ్డీ రేట్లను పెంచడం వంటి నిర్ణయాలు తీసుకోవడం తొందరపాటే అవుతుందని భావిస్తున్న ఆఆర్‌బిఐ, ప్రస్తుతం వేచి చూసే(Wait and Watch) వ్యూహాన్ని అమలు చేస్తోంది.

భవిష్యత్తులో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరింత తీవ్రమైతేనే దానికి అనుగుణంగా తదుపరి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రస్తుత సవాళ్ల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆఆర్‌బిఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ (GDP) వృద్ధి రేటు అంచనాను మునుపటి 6.9 శాతం నుండి స్వల్పంగా సవరించి 6.6 శాతానికి కుదించింది. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలు మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, 6.6 శాతంతో ముందుకు సాగుతున్న భారత ఆర్థిక వృద్ధి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదిగా నిలుస్తుందని కేంద్ర బ్యాంకు ధీమా వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+