భారతదేశంలో తెలియకుండానే చాలా బంగారు గనులు దాగి ఉన్నాయి. వాటిపై భూగర్భ శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తున్నారు..ఒక్కో భూగర్భ గనిని వెలుగులోకి తీసుకువస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లా బంగారు గని వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా ప్రకృతి అందాలు, ఖనిజ సంపదలతో అలరారుతున్న జబల్పూర్ తాజాగా బంగారు గనులతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది. ఈ నగరానికి సమీపంలోని సిహోరా తహసీల్ పరిధిలోని మహాంగ్వా కియోలారి గ్రామంలో భారీ బంగారు నిక్షేపాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) బృందం అనేక సంవత్సరాలుగా ఇక్కడి నేల నమూనాలను సేకరించి.. ఖనిజ విశ్లేషణలు నిర్వహించింది. వారు సేకరించిన డేటా ప్రకారం.. సుమారు 100 హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు పరిశోధనలో తేలింది. మిలియన్ల టన్నుల స్థాయిలో అక్కడ బంగారం ఉండే అవకాశాలను శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అదే కనుక నిజమైతే.. ఇది మధ్య భారతదేశంలో ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద ఖనిజ నిల్వలలో ఒకటిగా చరిత్రలో నిలుస్తుంది.

భూగర్భ శాస్త్రవేత్తలు ఆ నగరంలోని నేల, రాతి నమూనాలను విశ్లేషించగా.. బంగారంతో పాటు రాగి, బాక్సైట్, మాంగనీస్ వంటి విలువైన లోహాల జాడలు కూడా లభించాయి. ఈ ప్రాంతం ఇంతకుముందే ఇనుము ఖనిజం ఉత్పత్తికి ప్రసిద్ధిగా ఉన్నా.. ఇప్పుడు బంగారం గనులు బయటపడ్డాయి. GSI శాస్త్రవేత్తలు దీనిని దేశ ఆర్థిక వ్యవస్థను మార్చే ఘట్టంగా పేర్కొంటున్నారు.
ఇప్పటికే జబల్పూర్ ప్రాంతంలో 42 గనుల ద్వారా ఇనుము ఖనిజం ఉత్పత్తి జరుగుతోంది.. ఇందులో ఉత్పత్తి అయిన ఖనిజం చాలావరకు చైనా వంటి దేశాలకు ఎగుమతి అవుతోంది. తాజాగా Gold వంటి విలువైన ఖనిజం జత కావడం వల్ల ఈ ప్రాంతం భవిష్యత్‌లో అంతర్జాతీయ మైనింగ్ పెట్టుబడులకి ఆకర్షణీయంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ బంగారు నిల్వల మైనింగ్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు, మధ్యప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. కాగా గతంలో పన్నా వజ్రాల గనులు మధ్యప్రదేశ్‌ను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇప్పుడు జబల్పూర్ బంగారం అదే స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని పెంచే అవకాశముందని భావిస్తున్నారు.
అయితే ఇది అంత త్వరగా సాధ్యమయ్యే పరిస్థితి కాదు.. ప్రస్తుతం Gold నిల్వల అంచనాలు వాస్తవంగా మారాలంటే, సమగ్ర సర్వేలు, సాధ్యమయ్యే అధ్యయనాలు, పర్యావరణ ఆమోదాలు వంటి దశలను దాటుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇది ఖచ్చితంగా మధ్యప్రదేశ్‌తో పాటుగా భారతదేశ ఖనిజ రంగానికి ఒక నూతన శకం ఇవ్వనుంది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications