హైదరాబాద్ నగరం మరోసారి టెక్నాలజీ పరంగా దేశం దృష్టిని ఆకర్షించింది. మన జేబులో ఉన్న పాత బంగారాన్ని క్షణాల్లో నగదుగా మార్చుకునే సరికొత్త సదుపాయం ఇప్పుడు మన నగరంలో అందుబాటులోకి వచ్చింది. ఫిన్‌టెక్ స్టార్టప్ గోల్డ్ సిక్కా (Goldsikka) భారతదేశంలోనే మొట్టమొదటి 'AI పవర్డ్ గోల్డ్ ఏటీఎం' (AI Gold ATM)ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఇకపై బంగారం అమ్మడానికి జ్యూవెలరీ షాపుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు!

పాత బంగారం.. 30 నిమిషాల్లో నగదుగా..
సాధారణంగా పాత బంగారాన్ని అమ్మాలంటే షాపులకు వెళ్లడం, అక్కడ క్వాలిటీ చెక్ కోసం గంటల తరబడి వేచి చూడటం, ఆపై బేరసారాలు ఆడటం పెద్ద తలనొప్పి. కానీ, ఈ కొత్త గోల్డ్ ఏటీఎం (Gold ATM) తో ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ యంత్రం ద్వారా మీ బంగారాన్ని కరిగించి, దాని స్వచ్ఛతను పరీక్షించి, కేవలం 30 నిమిషాల్లో డబ్బును నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తుంది.
ఈ AI గోల్డ్ ఏటీఎం ఎలా పనిచేస్తుంది?
ఈ యంత్రం అత్యంత పారదర్శకంగా, అధునాతన టెక్నాలజీతో పనిచేస్తుంది..
- బంగారం కరిగించడం: మీరు బంగారాన్ని మిషన్‌లో ఉంచగానే, అది వెంటనే కరిగించే ప్రక్రియను ప్రారంభిస్తుంది.
- AI ప్యూరిటీ చెక్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ సహాయంతో బంగారం బరువు, స్వచ్ఛతను (Purity) ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా ఖచ్చితంగా లెక్కిస్తుంది.
- ఇన్ స్టాంట్ పేమెంట్: ఆ సమయానికి మార్కెట్‌లో ఉన్న బంగారం ధరను బట్టి మొత్తం విలువను లెక్కించి, అరగంటలో మీ ఖాతాలోకి నగదును పంపిస్తుంది.
కేవలం అమ్మడమే కాదు.. కొనవచ్చు కూడా!
ఈ ఏటీఎం కేవలం బంగారాన్ని కొనుగోలు చేయడానికే కాదు.. ఇందులో మరెన్నో ఫీచర్లు ఉన్నాయి..
- వర్చువల్ ట్రయల్: ఆగమెంటెడ్ రియాలిటీ (AR) టెక్నాలజీ ద్వారా మీరు ఏటీఎం ముందు నిలబడి నగలను వర్చువల్‌గా ధరించి చూడవచ్చు (Virtual Trial). మీకు నచ్చితే కొనుగోలు చేయవచ్చు.
- బంగారు నాణేల విక్రయం: ఇందులో 0.5 గ్రాముల నుండి 100 గ్రాముల వరకు వివిధ సైజుల్లో బంగారు నాణేలను 24/7 కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది.
భద్రత పరంగా ఫుల్ సేఫ్!
చోరీకి గురైన బంగారం లేదా మోసపూరిత లావాదేవీలను అరికట్టడానికి గోల్డ్ సిక్కా (Goldsikka) కఠినమైన నిబంధనలను ఏర్పాటు చేసింది. ఏ లావాదేవీ జరగాలన్నా ముందుగా కస్టమర్ తమ కేవైసీ (KYC) వివరాలను అందించాలి. యంత్రం నేర చరిత్రను, గుర్తింపు కార్డులను ధృవీకరించిన తర్వాతే పనులను ముందుకు తీసుకెళ్తుంది. ఏదైనా అనుమానం వస్తే వెంటనే లావాదేవీని బ్లాక్ చేస్తుంది.
భవిష్యత్తు ప్రణాళికలు
ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 14 సాధారణ గోల్డ్ ఏటీఎంలు ఉండగా.. రాబోయే ఏడాదిలో 100 వరకు AI పవర్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇవి తుది అనుమతుల కోసం సిద్ధంగా ఉన్నాయి.
అత్యవసర సమయంలో చేతిలో డబ్బు లేకపోయినా, ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని ఈ గోల్డ్ ఏటీఎం (Gold ATM) ద్వారా క్షణాల్లో క్యాష్ చేసుకోవచ్చు. టెక్నాలజీ సామాన్యుడికి ఎంతలా ఉపయోగపడుతుందనే దానికి ఈ ఇన్వెన్షన్ ఒక నిదర్శనం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications