Credit Card: జేబులో పైసా లేకపోయినా కొనేస్తున్నారు.. భారతీయుల కొత్త అలవాటు చూశారా?
మన దేశంలో డిజిటల్ విప్లవం ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు జనం చేతిలో నగదు కంటే ఫోన్లలో, జేబుల్లో ఉన్న కార్డులకే ఎక్కువ పవర్ ఇస్తున్నారు. తాజాగా విడుదలైన క్రెడిట్ కార్డ్ (credit card) ఖర్చుల లెక్కలు చూస్తే.. భారతీయుల షాపింగ్ అలవాట్లు ఎంత వేగంగా మారిపోతున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఈ ఏడాది ఏప్రిల్ (2026) నెలలోనే మన దేశంలో క్రెడిట్ కార్డుల ద్వారా జరిగిన లావాదేవీలు 7 శాతం పెరిగి, దాదాపు ₹1.97 లక్షల కోట్లకు చేరాయి. క్యాష్ లెస్ పేమెంట్స్ పై ప్రజల్లో నమ్మకం, ఆసక్తి ఎంతలా పెరిగిందో చెప్పడానికి ఈ నెంబర్ ఒక పెద్ద ఉదాహరణ.

చిన్న నగరాల్లోనూ పెరిగిన క్రేజ్!
ఒకప్పుడు క్రెడిట్ కార్డ్ (credit card) అంటే కేవలం హైదరాబాద్, ముంబై, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు రూట్ మారింది. ఆన్‌లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీలు, ట్రావెల్ బుకింగ్స్, చివరికి ఇంటి కరెంట్ బిల్లుల వరకు అన్నింటికీ క్రెడిట్ కార్డులనే వాడుతున్నారు. దీనికి తోడు యూపీఐ (UPI) కి క్రెడిట్ కార్డులను లింక్ చేసే సదుపాయం రావడం, కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ పెరగడంతో చిన్న నగరాలు (టైర్-2, టైర్-3) కూడా ఈ రేసులో దూసుకుపోతున్నాయి. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, రివార్డ్ పాయింట్ల కోసం జనం వీటిని వాడటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు.
ఈజీ ఈఎంఐల వైపు మొగ్గు!
నిజానికి గడిచిన మార్చి నెలలో పండగలు, ఇయర్ ఎండ్ సేల్స్ వల్ల క్రెడిట్ కార్డ్ (credit card) ఖర్చులు ఏకంగా ₹2.19 లక్షల కోట్లను తాకాయి. ఏప్రిల్‌లో ఆ వేగం కొంచెం తగ్గినా, ఓవరాల్‌గా మార్కెట్ మాత్రం చాలా బలంగా ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్లు, హోమ్ అప్లయన్సెస్ లాంటి ఖరీదైన వస్తువులను కొనేటప్పుడు జనం ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (EMI) ఆప్షన్లను ఎంచుకుంటున్నారు. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు కూడా నచ్చిన వస్తువులు కొనడం చాలా సులువుగా మారింది.
హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డ్, ఐసీఐసీఐ లాంటి పెద్ద బ్యాంకులు కూడా రకరకాల ట్రావెల్ బెనిఫిట్స్, కో-బ్రాండెడ్ కార్డులతో కస్టమర్లను ఆకర్షించడానికి పోటీ పడుతున్నాయి. అయితే, క్రెడిట్ కార్డ్ (credit card) వాడకం ఎంత సౌకర్యంగా ఉంటుందో.. అంతే జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిమిట్ ఉంది కదా అని అవసరానికి మించి ఖర్చు పెట్టి, సకాలంలో బిల్లులు కట్టకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, క్రమశిక్షణతో వాడుకుంటే ఈ డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డ్ ఒక అద్భుతమైన ఆయుధం.


Click it and Unblock the Notifications