భారత్‌కు రాగి కరువు తీర్చబోతున్న అదాని గ్రూప్.. చిలీ దిగ్గజం కోడెల్కోతో చారిత్రాత్మక ఒప్పందం..

భారతదేశ పారిశ్రామిక అవసరాలకు కీలకమైన Copper ఖనిజానికి దీర్ఘకాలిక ప్రాప్యతను పొందడం, దేశీయ రాగి సరఫరా గొలుసును బలోపేతం చేయడం లక్ష్యంగా అదానీ గ్రూప్ ఒక కీలక అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

అదానీ గ్రూప్‌కు చెందిన కచ్ కాపర్ లిమిటెడ్, ఉత్తర చిలీలోని కబుర్కాల రాగి ప్రాజెక్టులో ఉమ్మడిగా అన్వేషణ జరిపేందుకు చిలీ ప్రభుత్వ రంగ రాగి ఉత్పత్తి దిగ్గజం కోడెల్కోతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. లండన్‌లో జరిగిన ఎల్ఎంఈ వీక్ 2026 సదస్సు సందర్భంగా కచ్ కాపర్ డైరెక్టర్ జీత్ అదానీ, అదానీ నేచురల్ రిసోర్సెస్ సీఈఓ వినయ్ ప్రకాష్, కోడెల్కో ఛైర్మన్ బెర్నార్డో ఫాంటైన్ సమక్షంలో ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది.

Adani Group Adani Codelco agreement Kutch Copper Chile copper mining Codelco Chile India copper supply security Kaburkaala copper project copper exploration copper imports India global copper supply chain Mundra copper smelter critical minerals copper mining investment renewable energy electric vehicle industry Codelco

ప్రతిపాదిత భాగస్వామ్యం ప్రకారం.. ప్రపంచంలోనే ప్రధాన రాగి ఉత్పత్తి జిల్లాలలో ఒకటైన చిలీలోని అంటోఫగాస్టా ప్రాంతంలోని కలామా రాగి గని పరిధిలో ఉన్న కబుర్కాల ప్రాజెక్టులో ఇరు సంస్థలు కలిసి అన్వేషణ జరుపుతాయి. ఈ ఒప్పందం చిలీలోని విలువైన రాగి వనరులను గుజరాత్‌లోని ముంద్రాలో ఉన్న అదానీ సమీకృత రాగి స్మెల్టర్ కాంప్లెక్స్‌తో నేరుగా అనుసంధానిస్తుంది. దీనివల్ల అదానీ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా వైవిధ్యభరితమైన, పటిష్టమైన రాగి విలువ గొలుసును అభివృద్ధి చేసుకోవడానికి మార్గం సుగమమైంది.

భారతదేశ భవిష్యత్ పారిశ్రామిక, ఇంధన అవసరాలను తీర్చడంలో అంతర్జాతీయ రాగి వనరులను అందుబాటులోకి తెచ్చుకోవడం అత్యంత కీలకమని జీత్ అదానీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కేవలం ఒక మైనింగ్ ఆస్తిగా మాత్రమే కాకుండా, భారతదేశ భవిష్యత్తులో ఒక దీర్ఘకాలిక పెట్టుబడిగా చూస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Also Read

పునరుత్పాదక ఇంధనం, విద్యుదీకరణ, అధునాతన తయారీ, మౌలిక సదుపాయాలు మరియు సాంకేతికత వంటి దేశ వృద్ధికి చోదకశక్తిగా నిలిచే కీలక పరిశ్రమలకు రాగి ఎంతో అవసరమని, ఈ ఒప్పందం ద్వారా ఆ రంగాలకు నిరంతరాయ సరఫరా భరోసా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న మూలధనం, సాంకేతికత ఆధారిత అన్వేషణ, భారీ ప్రాజెక్టుల అమలు సామర్థ్యాలను కోడెల్కో యొక్క భూగర్భ శాస్త్ర నైపుణ్యం, అంతర్జాతీయ అనుభవంతో మిళితం చేయనున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది.

మరోవైపు గత ఏడాది కాలంగా అదానీ గ్రూప్‌తో కొనసాగుతున్న చర్చల్లో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన ముందడుగు అని కోడెల్కో ఛైర్మన్ బెర్నార్డో ఫాంటైన్ అన్నారు. చిలీ దేశం, తమ సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడుతూనే, ప్రపంచ స్థాయి భాగస్వాములను ఆకర్షించి తమ అన్వేషణ పోర్ట్‌ఫోలియో నుండి విలువను వెలికితీయడంలో కోడెల్కో సామర్థ్యాన్ని ఈ ఒప్పందం చాటిచెబుతోందని ఆయన వివరించారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా అన్వేషణ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడం, ఆర్థిక నష్టాలను పంచుకోవడంలో భాగంగా కోడెల్కో ఈ నిర్ణయం తీసుకుంది. భద్రత, పర్యావరణ ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతమైన మైనింగ్ అన్వేషణ జరపడానికి ఇరు సంస్థలు కట్టుబడి ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+