ముంబై: బుధవారం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన కాసేపటికే సాంకేతిక సమస్య కారణంగా ట్రేడింగ్ నిలిచిపోయింది. 2.7 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్‌ను రెండు టెలికం లైన్స్ ఇబ్బంది పెట్టాయి. నిన్న ఉదయం గం.10.15 సమయానికి నిఫ్టీ 50 సూచీ 14,420 పాయింట్ల వద్ద స్టక్ అయింది. అప్పటికి అంతకుముందు రోజుతో పోలిస్తే నిఫ్టీ 113 పాయింట్లు ఎక్కువగా ఉంది. నిఫ్టీ బ్యాంకు 35,626.60 పాయింట్ల వద్ద ఉంది. ఇది 1.45 శాతం ఎగిసింది.
నిఫ్టీ ప్రైస్ ఇండెక్స్‌లో మార్పు లేకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఆ తర్వాత సాంకేతిక సమస్య నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ నిలిచింది. స్పాట్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ, ఇతర సూచీల అప్ డేట్ ఫెయిల్ అయింది. సెన్సెక్స్ మాత్రం సాధారణంగా కొనసాగింది. ఎన్ఎస్ఈ 11 రంగాలు సాంకేతిక సమస్యను ఎదుర్కొన్నాయి. అయితే ఇందుకు టెలికం లింక్స్ ఇష్యూనే కారణంగా చెబుతున్నారు. రెండు సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నాయి.

ఆ రెండు టెలికం సంస్థలు ఇవే
రెండు టెలికం సర్వీస్ ప్రొవైడర్లు కూడా సాంకేతిక సమస్యను ధృవీకరించాయి. దీంతో ప్రపంచ అతిపెద్ద డెరివేటివ్స్ ట్రేడింగ్ మధ్యాహ్నం గం.11.40 సమయానికి నిలిచిపోయింది. దీనిపై SEBI.. నిఫ్టీ నుండి వివరణ కోరింది. దీనిపై ఎన్ఎస్ఈ శుక్రవారం ప్రిలిమినరీ నివేదికను సమర్పించే అవకాశం ఉంది. తమ లీజ్ లైన్ డేటా పైప్స్ ట్రాన్సుఫర్ చేయలేదని గుర్తించిన తర్వాత ఎన్ఎస్ఈ ఇంజినీర్స్... పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ రెండు సర్వీస్ ప్రొవైడర్లు భారతీ ఎయిర్‌టెల్, టాటా కమ్యూనికేషన్స్.

ట్రేడింగ్ నిలిపివేత, పొడిగింపు
ఎన్ఎస్ఈ క్యాష్, డెరివేటివ్ సెగ్మెంట్ ట్రేడింగ్‌ను నిలిపివేసింది. టెలికం సర్వీస్ ప్రొవైడర్ల రెండు లింక్స్‌లో సమస్యలు గుర్తించారు. దీంతో ఎంత సమయంలోగా ఇది పునఃప్రారంభమవుతుందో వెల్లడించలేకపోయారు. మధ్యాహ్నం గం.3 వరకు కూడా ట్రేడింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఆ తర్వాత ట్రేడింగ్ సమయాన్ని పొడిగించారు.

పలుమార్లు సాంకేతిక సమస్య
ఇటీవలి కాలంలో ఏషియా పసిఫిక్ ప్రాంతంలో పలు స్టాక్ ఎక్స్చేంజీలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అక్టోబర్ నెలలో టోక్యో స్టాక్ ఎక్స్చేంజీలో సాంకేతిక సమస్య తలెత్తింది. నవంబర్ 16న ఆస్ట్రేలియా స్టాక్ ఎక్స్చేంజీ దాదాపు అరగంట మాత్రమే పని చేసింది. మిగతా రోజంతా ఆగిపోయింది. 2017 జూలైలోను మన మార్కెట్లలో ఇదే పరిస్థితి కనిపించింది. అప్పుడు ఎన్ఎస్ఈ క్యాష్, డెరివేటివ్ సెగ్మెంట్‌లో టెక్నికల్ ఇష్యూ వచ్చింది.
More From GoodReturns

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications