మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ సీఈవోగా భారతీయుడైన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. దీంతో పదహారేళ్లుగా వివిధ బాధ్యతలు నిర్వర్తించిన ట్విట్టర్ సహ వ్యవస్థాపకులు జాక్ డోర్సీ సీఈవోగా వైదొలిగారు. దీంతో సిలికాన్ వ్యాలీలో గూగుల్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, ఐబీఎం అరవింద్ కృష్ణ, అడోబ్ శంతను నారాయణ, వీఎంవేర్ రంగరాజన్ రఘురాం తర్వాత మరో దిగ్గజ కంపెనీకి సీఈవోగా నియమితులైన క్లబ్‌లో చోటు దక్కించుకున్నారు అగర్వాల్. పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈవోగా నియమితులైన నేపథ్యంలో ఆయన వ్యక్తిగత విషయాల గురించి భారతీయులు ఎక్కువమంది సెర్చ్ చేస్తున్నారు. ఆయన వేతనం ఎంత, ఐఐటీ ర్యాంక్ ఎంత, ఆయన కుటుంబం, భార్య ఎవరు అని గూగుల్ చేస్తున్నారు.

అగర్వాల్ పర్సనల్ డిటైల్స్ కోసం సెర్చింగ్
ప్రస్తుతం సోషల్ మీడియాలో పరాగ్ అగర్వాల్ పేరు మార్మోగుతోంది. ముఖ్యంగా దేశీయ నెటిజన్లు ఆయన గురించి గూగుల్ చేస్తున్నారు. గూగుల్ ట్రెండ్స్ పరిశీలిస్తే భారతీయ యూజర్లు ఎక్కువగా పరాగ్ అగర్వాల్ వయస్సు, ఆయన నెట్ వర్త్, ట్విట్టర్ వేతనం, పరాగ్ అగర్వాల్ భార్య, ఐఐటీ ర్యాంకు వాటి కోసం వెతుకుతున్నారు.
పరాగ్ అగర్వాల్ భార్య పేరు వినీత. ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌లో అతనికి వచ్చిన ర్యాంకు 77. ఐఐటీ బాంబే నుండి కంప్యూటర్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీ నుండి కంప్యూటర్స్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. మైక్రోసాఫ్ట్, ఏటీ అండ్ టీ ల్యాబ్స్, యాహూలలో పని చేశారు.2010-11లో ట్విట్టర్‌లో చేరారు.

పరాగ్ అగర్వాల్ వేతనం ఎంతంటే?
ట్విట్టర్‌ను 2006లో ప్రారంభించారు. జాక్ డోర్సీ సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. రెండేళ్ల తర్వాత సీఈవోగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2015లో మళ్లీ డోర్సీ సీఈవో అయ్యారు. ఆయన స్థానంలో ఇప్పుడు పరాగ్ అగర్వాల్ వచ్చారు. ఇటీవలి ఫైలింగ్ ప్రకారం అగర్వాల్ ఏడాది వేతనం 1 మిలియన్ అమెరికన్ డాలర్లు. దీంతో పాటు బోనస్‌లు, నియంత్రిత స్టాక్ యూనిట్స్, పనితీరు ఆధారిత స్టాక్ యూనిట్స్ వ్యాల్యూ 12.5 మిలియన్ డాలర్లు అందుకుంటారు.

యంగెస్ట్ సీఈవో
1984లో జన్మించిన పరాగ్ అగర్వాల్ 37 ఏళ్ల వయస్సులో ట్విట్టర్ సీఈవో అయ్యారు. ఎస్అండ్ పీ 500 యంగెస్ట్ సీఈవోల్లో అగర్వాల్ ఉన్నారు. ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వయస్సు కూడా 37 ఏళ్లే. బెర్క్‌షైర్ హాత్‌వే ఇంక్ సీఈవో వారెన్ బఫెట్ (91) ఎస్ అండ్ పీ 500లో అత్యంత ఓల్డెస్ట్ సీఈవో. ఎస్ అండ్ పీ 500లో సగటు సీఈవో వయస్సు 58. ఎస్ అండ్ పీ డైరెక్టర్స్ సగటు వయస్సు 63.

భారత సీఈవోలు
ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన వివిధ కంపెనీల్లో భారతీయ సీఈవోలు చాలామంది ఉన్నారు.
- సత్య నాదెళ్ల - మైక్రోసాఫ్ట్ - మార్కెట్ క్యాప్ 2,527 బిలియన్ డాలర్లు.
- సుందర్ పిచాయ్ - అల్పాబెట్ (గూగుల్) - మార్కెట్ క్యాప్ 1,924 బిలియన్ డాలర్లు.
- శంతను నారాయన్ - అడోబ్ - మార్కెట్ క్యాప్ 325 బిలియన్ డాలర్లు.
- అరవింద్ కృష్ణ - ఐబీఎం - మార్కెట్ క్యాప్ 106 బిలియన్ డాలర్లు.
- సంజయ్ మెహ్రోత్రా - మైక్రాన్ టెక్నాలజీ- మార్కెట్ క్యాప్ 95 బిలియన్ డాలర్లు.
- నికేష్ అరోరా - పాలో ఆల్టో నెట్ వర్క్స్- మార్కెట్ క్యాప్ 54 బిలియన్ డాలర్లు.
- రంగరాజన్ రఘురాం- వీఎం వేర్ - మార్కెట్ క్యాప్ 51 బిలియన్ డాలర్లు.
- జయశ్రీ ఉల్లాల్ - అరిస్టా నెట్ వర్క్స్ - మార్కెట్ క్యాప్ 38.7 బిలియన్ డాలర్లు.
- పరాగ్ అగర్వాల్ - ట్విట్టర్ - మార్కెట్ క్యాప్ 38.5 బిలియన్ డాలర్లు.
- జార్జ్ కురియన్ - నెట్ యాప్ - మార్కెట్ క్యాప్ 20 బిలియన్ డాలర్లు.
- రేవతి అద్వైతి - ఫ్లెక్స్ - మార్కెట్ క్యాప్ 8 బిలియన్ డాలర్లు.
- అంజలిసుద్ - విమియో - మార్కెట్ క్యాప్ 3 బిలియన్ డాలర్లు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications