అమెరికాలో భారతీయులు vs అమెరికన్లు నిజంగా ఎవరు ఎక్కువ సంపాదిస్తారు?
అమెరికాలో ఉద్యోగం చేసుకోవాలన్నది చాలా భారతీయుల కల. పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలు, మంచి కెరీర్ గ్రోత్, హై సాలరీస్ వున్నందున అక్కడ పని చేయడం ఆకర్షణీయంగా ఉంటుంది. గడచిన కొన్ని సంవత్సరాలలో H-1B వీసా నియమాలు, కొత్త రూల్స్, పరిమితులు వల్ల కొంత తెలియని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ, యువ IT ప్రొఫెషనల్స్ అమెరికాలో ఉద్యోగం పొందడం ద్వారా కెరీర్ మెరుగుదల మరియు భవిష్యత్తులో ఎక్కువ డబ్బు సంపాదించగల అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు.
కానీ అక్కడి వేతనాలు భారతీయులు మరియు అమెరికన్లకు ఒకేలా ఉంటాయా? ఇప్పటి రోజుల్లో ఎక్కువ మంది భారతీయులు విదేశాల్లో మంచి ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. సౌదీ అరేబియా, కెనడా, UAE వంటి దేశాల్లో ఎక్కువుగా భారతీయ జనాభా ఉన్నట్టు మీరు గమనించవచ్చు. అయితే, అమెరికాలో పని చేసుకోవాలని చాలా మందికి ప్రత్యేక ఆకర్షణ ఉంది. కారణం అమెరికా వేతనాలు ఎక్కువుగా ఉంటాయ్ కాబట్టి.

భారతీయుల జీతాల అమెరికాలో: అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లే భారతీయులు ఎక్కువగా డాక్టర్లు, ఇంజినీర్లు, నర్స్‌లు, సైంటిస్టులు, రీసర్చ్ స్కాలర్లు వంటి హై-పేయింగ్ ఉద్యోగాల్లో ఉంటారు. US సెన్సస్ బ్యూరో ప్రకారం, అమెరికాలో భారతీయుల సగటు వార్షిక ఆదాయం $95,000 (సుమారు రూ. 77 లక్షలు) గా ఉంది. ఇది సగటు వేతనం కాబట్టి, వ్యక్తుల ఉద్యోగం, కంపెనీ, రాష్ట్రం ప్రకారం తేడాలు ఉండవచ్చు.
అమెరికన్ల జీతాలు: అమెరికాలో సాధారణంగా ఒక అమెరికన్ ఉద్యోగి సంవత్సరానికి సుమారు $59,000-$68,000 (సుమారు రూ. 48-55 లక్షల) వేతనం సంపాదిస్తాడు. నెలకు సుమారు $5,000-$6,000 (సుమారు రూ. 4-5 లక్షల) వేతనం వస్తుంది. కొందరు అమెరికన్లు, ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ కారణంగా, వారి వేతనం తక్కువగా ఉందని ఫిర్యాదు చేస్తారు.
జీతాల్లో తేడా ఎందుకు ఉంటుంది?
నాన్-IT రంగాల్లో, అంటే మాన్యుఫాక్చరింగ్, సేల్స్, అడ్మినిస్ట్రేషన్ వంటి సెక్టార్లలో, అమెరికన్లు సాధారణంగా ఎక్కువ వేతనం పొందే అవకాశమే ఎక్కువ. దీని ప్రధాన కారణం వారు స్టానికులు కావడం. స్టానికులు కావడం వల్ల వారు చర్చల ద్వారా వేతనం పెంచుకోవడంలో ఎక్కువ సత్తా చూపుతారు. అంటే, జాబ్‌లోకి చేరేటప్పుడు లేదా ప్రమోషన్/పెంచడం సమయంలో వారికీ ఎక్కువ పరపతి ఉంటుంది.
కానీ IT మరియు సాఫ్ట్‌వేర్ అభివృద్ధి రంగంలో పరిస్థితి కొంచెం వేరుగా ఉంటుంది. ఇక్కడ చాలా మంది భారతీయులు అమెరికాలోని IT కంపెనీలలో పని చేస్తున్నారు. వీరి వద్ద ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాలు, ప్రోగ్రామింగ్ మరియు సాఫ్ట్‌వేర్ టూల్స్‌లో మంచి అనుభవం ఉంటుంది. ఆ నైపుణ్యాల వల్ల, కొన్ని సందర్భాల్లో ఈ భారతీయ ఉద్యోగులు అమెరికన్ల కంటే ఎక్కువ వేతనం సంపాదించగలరు, ముఖ్యంగా పెద్ద టెక్ కంపెనీలు, ఉత్పత్తి కంపెనీలు లేదా ప్రత్యేక ఉద్యోగాలు ఉంటే.
Non-IT రంగాల్లో స్థానికులు ఎక్కువ వేతనం పొందే అవకాశం ఉంది, కానీ IT/సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన భారతీయులు ఎక్కువ వేతనం పొందగలరు. ఈ జీతాలు తేడా చాలా కారణాల వల్ల జరుగుతుంది మీ నైపుణ్యాలు, అనుభవం, ఉద్యోగ రంగం, అలాగే మీరు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నారో కూడా ముఖ్యం. కొన్ని రాష్ట్రాల్లో వేతనాలు ఎక్కువగా ఉంటాయి, మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంటాయి.
అమెరికాలో భారతీయులు మరియు అమెరికన్లు పొందే వేతనాలు ఒకేలా ఉండవు. ఇది పని చేసే రంగం, ఉద్యోగం, రాష్ట్రం, చర్చల సామర్థ్యం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా IT రంగంలో, కొందరు భారతీయులు స్థానిక అమెరికన్ల కంటే ఎక్కువ వేతనం పొందే పరిస్థితులు కూడా ఉంటాయి.


Click it and Unblock the Notifications