భారతీయులు విపరీతంగా కొంటున్నవి ఏంటో తెలుసా..? కార్లు, ఐఫోన్స్ కాదంట!
ప్రపంచమంతా ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతోంది. ఇండియా ఏమీ అందుకు మినహాయింపు కాదు. కానీ పెరుగుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా భారతీయుల ఖర్చులు పెరిగాయి. కార్లు, ఐఫోన్స్ వంటి లగ్జరీ ఐటమ్స్ కొనుగోళ్లకు ముందుకు వెళ్తున్నారు. అయితే ఓ స్టడీ ప్రకారం.. ఇండియన్స్ దేనిమీద ఎక్కువగా ఖర్చు పెట్టారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం.
ప్రతి ఒక్కరూ రిచ్ గా బతకడానికి ఇళ్లు, కార్లు, ఐఫోన్స్ వంటి పలు సౌకర్యాలను సమకూర్చుకుంటూ ఉంటారు. అందుకోసం భారీగా వెచ్చిస్తారు. కానీ ఇండియాలో మాత్రం అందుకు భిన్నంగా సౌందర్య సాధనాలపై భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. గత 6 నెలల్లో ఏకంగా 5 వేల కోట్లకు పైగా వీటి కొనుగోళ్లకు వెచ్చించినట్లు చెప్పి షాక్ ఇచ్చింది.

మహిళలు వినియోగించే లిప్ స్టిక్, నెయిల్ పాలిష్, ఐలైనర్ సహా 100 మిలియన్లకు పైగా కాస్మొటిక్ ఉత్పత్తులు విపరీతంగా సేల్ అయినట్లు కాంటార్ వరల్డ్‌ప్యానెల్ అధ్యయనం పేర్కొంది. గత 6 నెలల్లో టాప్ 10 ఇండియన్ నగరాల్లో ఈ కొనుగోళ్లు భారీగా జరిగినట్లు తెలిపింది. వీటిలోనూ 40 శాతం ఆన్ లైన్ ద్వారా పర్చేజ్ చేసినట్లు వెల్లడించింది.
నివేదిక ప్రకారం.. గత 6 నెలల్లో వినియోగదారులు సగటున సౌందర్య సాధనాల కోసం రూ.1,214 ఖర్చు చేశారు. సాంప్రదాయ ఉత్పత్తులైన కాజల్, లిప్‌స్టిక్‌ల కోసం భారతీయులు విపరీతంగా అన్వేషిస్తున్నారు. పార్టీలు, పండుగలు వంటి విభిన్న సందర్భాల్లో రోజువారీ దుస్తులకు అనుగుణంగా ప్రైమర్, ఐ షాడో, కన్సీలర్‌లు వంటి ఉత్పత్తుల వినియోగానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో సాధారణ సగటు కాస్మొటిక్ కొనుగోళ్లతో పోలిస్తే గత 6 నెలలుగా 1.6 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది.ఇండియాలో పట్టణీకరణ వేగవంతం కావడం, ఆన్ లైన్ ద్వారా ఆయా ఉత్పత్తుల లభ్యత సులభతరం కావడం ఇందుకు కారణమని పేర్కొంది.


Click it and Unblock the Notifications