జీవితంలో ప్రయాణాలు చేయడం తప్పనిసరి. అదే విదేశీ ప్రయాణాలంటే భారతీయులు ఎగిరి గంతేస్తారు. కానీ డబ్బు ఖర్చుపెట్టే విషయంలోనే కొంచెం వెనకడుగు వేస్తారు. కానీ తాజా నివేదికలు చూస్తుంటే ఈ అభిప్రాయం తప్పని అర్థమవుతోంది. విదేశాలకు వెళ్లడానికి ఇండియన్స్ పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నారని తెలుస్తోంది. ఎక్కువగా స్నేహితులు, కుటుంబాలతో కలిసి సమయం గడపడానికి ప్రాముఖ్యత ఇస్తున్నట్లు అర్థం అవుతోంది.

డబుల్ ఖర్చు:
విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు ప్రతి నెలా సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు We3Online అనే సంస్థ తెలిపింది. ప్రస్తుత ట్రెండ్ ను కొవిడ్ వ్యాప్తి ముందుతో పోలిస్తే, దాదాపు రెండు రెట్లు పెరిగినట్లు పేర్కొంది. రిజర్వు బ్యాంకు డేటా చెబుతోందని పేర్కొంది. ఇండియా నుంచి బయటకు వెళ్తున్న నగదుకు సంబంధించి కేంద్ర బ్యాంకు వద్ద గణాంకాలు ఉంటాయి. వీటి ఆధారంగానే ఈ నివేదిక సిద్ధం చేసినట్లు వెల్లడించింది.

భారతీయులు ఇష్టపడే దేశాలివే:
"2022-23లో ఏప్రిల్-డిసెంబర్ మధ్య లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద భారతీయులు విదేశీ ప్రయాణల కోసం రూ.995 కోట్లు ఖర్చు పెట్టారు. RBI డేటా ప్రకారం, 2021-22లో ఈ విభాగం కింద నమోదైన ఖర్చు కేవలం రూ.416 కోట్లే. 2019-20లో కరోనా ప్రారంభానికి ముందు దాదాపు రూ.540 కోట్లు వెచ్చించారు. కాగా వియత్నాం, థాయిలాండ్, యూరప్, బాలి ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడే ప్రాంతాలు" అని We3Online భాగస్వామి సపాన్ గుప్తా తెలిపారు.

75 శాతం విదేశాలకే:
ప్రస్తుతం సరసమైన ధరలకు అంతర్జాతీయ ప్రయాణాలు అందుబాటులో ఉండటం, సాంకేతిక పురోగతి వల్ల.. ట్రావెల్ పరిశ్రమ భారీ వృద్ధిని నమోదు చేస్తున్నట్లు Sankash ట్రావెల్స్ సంస్థ సహ వ్యవస్థాపకులు ఆకాష్ దహియా తెలిపారు. తమ కస్టమర్లలో 75 శాతం మంది విదేశీ ప్రయాణాల వైపు మొగ్గుచూపుతున్నట్లు చెప్పారు. ఐరోపా దేశాలు సహా బాలి, దుబాయ్, వియత్నాంలకు వెళ్లేందుకు భారతీయులు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు.

TCS పెంపు అమలైతే కష్టమే..
'ట్రావెల్-నౌ-పే-లేటర్'కు ప్రజలు ఎక్కువగా అలవాటు పడినట్లు దహియా చెప్పారు. ఒకేసారి కాకుండా నెలవారీ చెల్లించే అవకాశం లభిస్తుండటంతో.. మరింతగా హాలిడేను ఎంజాయ్ చేసే ట్రెండ్ ఎక్కువవుతున్నట్లు పేర్కొన్నారు. తద్వారా గతంలో గోవాకి వెళ్దామనుకున్న వ్యక్తి.. ఇప్పుడు విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ వచ్చే ఏడాది బడ్జెట్ లో విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS కింద ప్రస్తుతం 5 శాతం ఉన్న పన్ను రేటును 20 శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఇండియన్స్ అంతర్జాతీయ ప్రయాణాలపై ఈ ప్రతిపాదన తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications