Twitter Profits: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ప్రస్తుతం అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ను విజయవంతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గడచిన మూడు నెలల్లో భారీగా నిధుల రూపంలో సహాయం చేసినట్లు వెల్లడైంది. రానున్న రోజుల్లో ఎన్నికల నాటి వరకు మరింత సహాయం అందించనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో భారీ విజయం సాధించిన మస్క్ ఇండియాలో మాత్రం చిత్తుచిత్తుగా ఓడిపోయారు.
వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సేవలు అందిస్తున్న ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌ను దాదాపు 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. మస్క్ వచ్చిన తర్వాత ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చారు. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ కంపెనీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వీటన్నింటి తర్వాత 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆర్థిక ఫలితాల వివరాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖలో దాఖలు చేసింది. ఇండియాలో ట్విట్టర్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా పనిచేస్తున్న ఎక్స్ ఆదాయాలతో పాటు లాభాలు భారీగా క్షీణించినట్లు వెల్లడైంది.

గత ఏడాదితో పోలిస్తే కంపెనీ భారతీయ విభాగం ఆదాయం దాదాపు 90% పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.207.7 కోట్లుగా ఉన్న ట్విట్టర్ ఆదాయం ప్రస్తుతం రూ.21.1 కోట్లకు తగ్గింది. ఇదే క్రమంలో కంపెనీ లాభం కూడా 90 శాతం తగ్గి రూ.30.4 కోట్ల నుంచి రూ.3.1 కోట్లకు పడిపోయింది. ట్విట్టర్ కంపెనీని మస్క్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఇండియాలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 90 శాతం మందిని తొలగించింది. దీని తర్వాత కంపెనీ ఆదాయం సైతం భారీ క్షీణతను చూసింది. ట్విట్టర్‌లో ప్రస్తుతం భారతదేశంలో 12 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వారి జీతాలు, ఖర్చులు కేవలం రూ.6.2 కోట్లుగా.. తొలగింపులకు ముందు వ్యయాలు రూ.130.1 కోట్లుగా ఉన్నాయి. ఉద్యోగుల తొలగింపులతో ఖర్చులు దాదాపు 95 శాతం తగ్గిపోయాయి.
మస్క్ ట్విట్టర్ కంపెనీని సొంతం చేసుకున్న తర్వాత సబ్ స్క్రిప్షన్ మోడల్ తీసుకురావటంతో ఆదాయాల మార్గం ఏర్పడింది. అయితే ఇతర మార్గాల్లో వస్తున్న ఆదాయాలు భారీగా క్షీణతను చూసినట్లు వెల్లడైంది. వాస్తవానికి ఇండియాలో కోట్ల మంది కస్టమర్లు ఉన్న ట్విట్టర్ దాని ద్వారా ఆదాయాలను ట్యాప్ చేయటంలో భారీగా వెనకుపడిందని చెప్పుకోవచ్చు. కేవలం ఒక్క రోజులో ఎలాన్ మస్క్ సంపద ఏకంగా 33.5 బిలియన్ డాలర్లు పెరిగి 270 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వాస్తవానికి ఇదొక పెద్ద రికార్డు. ఎందుకంటే ఇంత భారీస్థాయిలో డబ్బును కేవలం ఒక్క రోజులో ఏ బిలియనీర్ సంపాదించి ఉండకపోవచ్చు. మస్క్ తర్వాత బిలియనీర్ల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ మధ్య దాదాపు 61 బిలియన్ డాలర్లు తేడా ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications