భారత్‌లో వేగంగా పెరుగుతున్న బిట్ కాయిన్,క్రిప్టో పెట్టుబడులు
గతంలో ఎన్నడులేని విధంగా భారత పెట్టుబడిదారులు బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే పూర్తిగా క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరంగానే అభిప్రాయపడుతున్నారు మార్కెట్ నిపుణులు. 2020 ఏప్రిల్ నాటికి 923 డాలర్ల వరకు భారతీయులు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టారు. కానీ ఏడాది కాలంలో అంటే 2021 మే నాటికి ఇవి 6.6 బిలియన్ డాలర్ల(రూ.49,189)కు చేరుకుంది. 154 దేశాల్లో క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల్లో భారత్ 11వ స్థానంలో ఉంది.
భారత్‍లో 1.39 బిలియన్ల జనాభా ఉంది. ఇక్కడి యువత సాంకేతక పరిజ్ఞానాన్ని క్రిప్టో పొదుపుకు మరింత అనుకూలంగా మార్చుకుంటోంది. భారత్ అతిపెద్ద మార్కెట్. క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజీలకు, ప్రపంచ పెట్టుబడిదారుల నుండి నిధులను ఆకర్షించేందుకు భారత్‌లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయితే సెంట్రల్ బ్యాంకు క్రిప్టో పైన ఆందోళన వ్యక్తం చేస్తోన్న పరిస్థితుల్లో ఇందులో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి.

2018 ఏప్రిల్ నెలలో ఆర్బీఐ క్రిప్టో కరెన్సీ పైన బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. క్రిప్టోకు వ్యతిరేకంగా ఆర్బీఐ నిర్ణయం ఉంది. అయితే గత ఏడాది మార్చి నెలలో సుప్రీం కోర్టులో క్రిప్టోకు అనుకూలంగా నిర్ణయం వచ్చింది. అప్పటి నుండి వర్చువల్ కరెన్సీ డిమాండ్ పెరిగింది. 2018 నాటి క్రిప్టో సూచనలను ఇటీవల మే 31వ తేదీన ఆర్బీఐ పక్కన పెట్టింది. అయితే క్రిప్టో పైన ఆందోళన వ్యక్తం చేస్తూనే, మౌనంగా ఉంది.


Click it and Unblock the Notifications